Rating : 3.25 / 5
Star Cast : మహేష్ బాబు, సమంత, బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ, ప్రకాష్‌రాజ్, తనికెళ్ళ భరణి, కోటా శ్రీనివాస రావు, సోనూ సూద్, షియాజీ షిండే, నాజర్, సుమన్, చంద్ర మోహన్ తదితరులు
Directed by : శ్రీను వైట్ల
Produced by : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
Gist : Daring & Dashing
కథ : నీతికి, న్యాయానికి కట్టుబడి ఎవరికి తలవంచని పోలీసు ఉన్నతాధికారి అజయ్(మహేష్) మాఫియ డాన్ నాయక్ ను పట్టుకునేందుకు టర్కీ వెళ్ళి ప్రశాంతి(సమంత)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మాఫియ పని పడుతూనే ప్రేమను గెలిపించుకునే క్రమంలో అజయ్ తన తండ్రి శంకర్ నారాయణ(ప్రకాష్ రాజ్) గతం తెలుసుకుంటాడు. అందరి మంచి కోరుకునే శంకర్ నారాయణకు జరిగిన అన్యాయం తెలుసుకుని తన తండ్రి శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడనేది తెరపై చూడాల్సిందే.
తారాగణ తీరు :
సూపర్‌స్టార్ మహేష్బాబు అత్యద్భుతమైన నటనతో అభిమానులని, ప్రేక్షకులని అలరించారు. ఈ చిత్రానికి మహేష్ నటన ఒక హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అందంతో టీనేజ్ అమ్మాయిల హృదయాలు దోచే మహేష్ ఈ చిత్రంలో మరింత అందంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు తన వైవిధ్య నటనతో అలరించే మహేష్ ఈ చిత్రంలోనూ అదే పంథాను కొనసాగించారు. బ్రహ్మానందం, ఎమ్.ఎస్. నారాయణ తమదైన శైలిలో ప్రేక్షకులకు నవ్వులు పంచారు. బ్రహ్మానందం ఇంటర్వెల్ వరకు అద్భుతమైన కామెడీ పండించారు. ఎమ్.ఎస్. నారాయణ తన ఎంట్రీ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినప్పటికీ చివరి వరకు అదే ధోరణిలో అలరించలేకపోయారు. ప్రకాష్ రాజ్, నాజర్, కోటా, షియాజీ తమ తమ పాత్రలకు తగు న్యాయం చేశారనే చెప్పాలి. కేవలం పాటలకు మరికొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైన సమంతకు తన నటనలోని సత్తా చూపే అవకాశం కూడా లేని పాత్రలో పరవాలేదనిపించింది.
దర్శకత్వం :
శ్రీను వైట్ల నుండి ప్రేక్షకులు ఆశించే కామెడీతో పాటు మహేష్ వంటి సూపర్ స్టార్ అభిమానులకు విజయదశమి ముందే అందించాడు దర్శకుడు. కథలో దమ్ము లేనప్పటికీ పూర్తిగా తన స్క్రీన్‌ప్లే, కామేడితో ఎన్నాళ్లుగానో హిట్ కోసం పరితపిస్తున్న మహేష్బాబుకు ఆయన అభిమానులకు దూకుడు పెంచారు.
సంగీతం : తమన్ తన అద్భుతమైన బాణీలతో ఇప్పటికే అభిమానులను ఉర్రూతలూగించడమే కాక బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎంతో చక్కగా అందించారు. ఈ చిత్రం విడుదలతో తమన్ మరిన్ని సినిమా అవకాశాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రత్యేకతలు : మహేష్ బాబు నటన, పార్వతి మెల్టన్ ఐటమ్ సాంగ్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్. నారాయణల కామెడీ, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు.
క్లుప్తంగా : సగటు ప్రేక్షకుడిని సరదాగా నవ్విస్తూ సాదాసీదాగా సాగిపోయే సాధారణ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అద్భుతాలు లేవనేది అసలు సత్యం.
|