Acharya Review: 'ఆచార్య' రివ్యూ.. మెగా పెర్ఫార్మెన్స్ అదుర్స్.. సినిమాలో అదే హైలెట్..

Acharya Review: ఆచార్య రివ్యూ.. మెగా పెర్ఫార్మెన్స్ అదుర్స్.. సినిమాలో అదే హైలెట్..
Acharya Review: సోషల్ మెసేజ్‌తో కమర్షియల్ హిట్లు కొట్టడం కొరటాల శివకు కామన్. అలాగే ఆచార్యలో కూడా అలాంటి ఒక మెసేజే ఉంది.

Acharya Review: మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ 'ఆచార్య'. పైగా కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కొరటాల శివ దీనికి డైరెక్టర్. అందుకే శుక్రవారం విడుదలయిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దానికి తగినట్టుగా సినిమా కూడా పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన పలువురు అభిమానులు ట్వీటర్‌లో తమ రివ్యూను షేర్ చేస్తున్నారు.

సోషల్ మెసేజ్‌తో కమర్షియల్ హిట్లు కొట్టడం కొరటాల శివకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఆచార్యలో కూడా అలాంటి ఒక సోషల్ మెసేజే ఉంది. నక్సలిజంతో కథనం మొదలయినా హిందూ ధర్మం గురించి మంచి మెసేజ్ ఇచ్చాడ కొరటాల. దాంతో పాటు మెగా అభిమానులను ఉర్రూతలూగించే ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

పాత్రల గురించి చెప్పడంలో, కొన్ని ఆసక్తికర అంశాలతో ఫస్ట్ హాఫ్ మొదలయినా.. సిద్ధ (రామ్ చరణ్) పాత్ర ఎంట్రీతో ముగించడం బాగుంటుంది. ఇందులో ఎవరి పాత్రకు వారు పూర్తిగా న్యాయం చేశారు. పూజా హెగ్డే కనిపించనంతసేపు అందంగా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌లో రామ్ చరణ్ పాత్ర చుట్టూ తిరిగే కథనం, దానికి తగినట్టుగా తన యాక్టింగ్.. అన్నీ సినిమాకు పెద్ద ప్లస్. మణిశర్మ అందించిన సంగీతం సినిమాలో మరో పాజిటివ్ అంశం.

రామ్ చరణ్, చిరంజీవి కలిసి చేసిన సన్నివేశాలు ప్రేక్షకులకు వెంటనే నచ్చేస్తాయి. ఇక ముందు నుండి మూవీ టీమ్ అంతా చెప్పినట్టు సిద్ధ పాత్ర సినిమాకు ప్రాణం అని చూసేవారికి కూడా అనిపిస్తుంది. ఇప్పటికీ మెగాస్టార్ డ్యాన్స్‌లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్‌లు ప్రేక్షకులలో జోష్‌ను నింపేలా ఉంటాయి. ముఖ్యంగా 'భలే బంజారా' పాట సినిమాకే హైలెట్.


Tags

Read MoreRead Less
Next Story