Gangubai Kathiawadi Review: 'గంగూబాయి కతియావాడి' రివ్యూ.. దర్శకుడి మ్యాజిక్ వర్కవుట్ అయినట్టే.!

Gangubai Kathiawadi Review: గంగూబాయి కతియావాడి రివ్యూ.. దర్శకుడి మ్యాజిక్ వర్కవుట్ అయినట్టే.!
Gangubai Kathiawadi Review: అసలైతే గంగూబాయి బయోపిక్ కథ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రాసుకున్నది కాదు.

Gangubai Kathiawadi Review: తెలుగులో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్ 'భీమ్లా నాయక్' విడుదల అవుతుందనే ఎన్నో ఇతర సినిమాలు ఫిబ్రవరి 25 బాక్సాఫీస్ రేస్ నుండి తప్పుకున్నాయి. కానీ హిందీ చిత్రం 'గంగూబాయి కతియావాడి' మాత్రమే భీమ్లా నాయక్‌కు పోటీగా విడుదల అయ్యింది. బాలీవుడ్‌లో అయితే ఈ సినిమా బాగానే బిజినెస్ చేసింది. పైగా విడుదలయినప్పటి నుండి పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంటోంది.

అసలైతే గంగూబాయి బయోపిక్ కథ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రాసుకున్నది కాదు. ఎస్ హుస్సేన్ జైదీ, జేన్ బార్గ్స్ అనే ఇద్దరు రైటర్స్ ముంబాయిలోని ప్రతీ కోణాన్ని పరిశీలించి అండర్‌వరల్డ్ ప్రపంచం గురించి అందరికీ చెప్పే 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబాయి' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఒక చాప్టర్ 'గంగూబాయి'.


కథ

పుస్తకంలోని రియాలిటీని ఏ మాత్రం చెరిపేయకుండా దీనిని సినిమా రూపంలో తెరకెక్కించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. పైగా దీని కథ చాలావరకు ప్రేక్షకులకు కూడా తెలుసు. హీరోయిన్ అవ్వాలనుకునే కలతో ముంబాయికి పారిపోయి వచ్చేసిన గంగూబాయి. ఒకరితో ప్రేమలో పడుతుంది. అతడి వల్ల ముంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలో చిక్కుకుపోతుంది. ఆ తర్వాత కమాతిపుర అనే రెడ్ లైట్ ఏరియాకే మాఫియా క్వీన్‌గా మారుతుంది.


పాత్రలు

ఇక గంగూబాయి పాత్రలో ఆలియా భట్‌ను ఇప్పటివరకు ఎవరూ ఊహించి ఉండరు. అందుకే సినిమా మొదలయిన చాలాసేపటి వరకు ఆలియాలో గంగూబాయిని చూడలేము. మెల్లగా ఆ పాత్రలో తను లీనమయ్యే విధానానికి ప్రేక్షకులు ఫిదా అవ్వక తప్పదు. అజయ్ దేవగన్, విజయ్ రాజ్, సీమా పహ్వా లాంటి వారు సహాయ పాత్రల్లో బాగా నటించారు. వారి పాత్రలతో ఎంతోకొంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేశారు.

'గంగూబాయి కతియావాడి' సినిమాలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి షాంతను మహేశ్వరి పర్ఫార్మెన్స్. ఎక్కువశాతం ఈ మూవీ అంతా సీరియస్ టోన్‌లో నడుస్తుండగా ఆలియా భట్, షాంతను మధ్య ఓ లవ్ ట్రాక్‌ను నడిపించాడు సంజయ్ లీలా భన్సాలీ. అది ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.


ఇతర అంశాలు

పాటల విషయాలనికొస్తే.. ధోలీడా తప్ప మిగతా పాటలేవీ అంత ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయలేకపోయాయి. ఇక స్క్రీన్‌ ప్లేలో తనదైన మ్యాజిక్‌ను కనబరిచాడు దర్శకుడు. ఎప్పటిలాగానే తన ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో కొన్ని సీన్లను పండించాడు. గంగూబాయి జీవితంలోని ప్రతీ అంశాన్ని చూపించడం కష్టం కాబట్టి అందులోని కొన్ని ముఖ్యమైన సంఘటనలనే మన ముందు పెట్టింది గంగూబాయి కతియావాడి టీమ్.


సినిమా కథ మెల్లగా మొదలైన ఆ తర్వాత గంగూబాయి తన జీవితంలో ఎలా ఎదిగింది అనే అంశాలు చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. మొత్తానికి గంగూబాయి గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి గంగూబాయి కతియావాడి సినిమా బాగానే నచ్చుతుంది. ఒకవేళ ఈ సినిమాకు ఇంకొక భాగం ఉంటే తన జీవితంలో అన్ని అంశాలు పూర్తిగా కవర్ చేసే అవకాశం ఉందేమో అన్న భావన ప్రేక్షకుడికి కలగవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story