Ghani Movie Review: గని మూవీ రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్ ప్లస్ స్పోర్ట్స్ డ్రామా..

Ghani Movie Review: గని మూవీ రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్ ప్లస్ స్పోర్ట్స్ డ్రామా..
Ghani Movie Review: ఎప్పుడూ గెలవాలనుకునే బాక్సర్ గని కథే ఇది. ఇందులో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

Ghani Movie Review: గత కొన్నిరోజులుగా శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లతో థియేటర్లు కలకలలాడుతున్నాయి. మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదలయ్యి సినిమా ఫైట్‌ను ఇంకా టఫ్ చేసింది. ఆర్ఆర్ఆర్‌తో ఓ మెగా హీరో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ శుక్రవారం మరో మెగా హీరో వరుణ్ తేజ్ తన స్పోర్ట్స్ డ్రామా 'గని'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

వరుణ్ తేజ్ ఇప్పటివరకు మాస్ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ మూవీస్‌లో నటించినా కూడా గని లాంటి స్పోర్ట్స్ డ్రామాను మాత్రం చేయలేదు. పైగా ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామాను యాక్షన్ లవర్స్‌కు నచ్చేలా తెరకెక్కించాడు డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి.

ఎప్పుడూ గెలవాలనుకునే బాక్సర్ గని కథే ఇది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామానే అయినా.. యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మొదటి హాఫ్ ప్రేమకథతో నింపేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇక వరుణ్ తేజ్ చాలా సన్నివేశాల్లో వన్ మ్యాన్ షోగా నటించాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై తెరకెక్కిన గని చిత్రం ప్రొడక్షన్ వాల్యూ విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ భామ సయ్యి మంజ్రేకర్ కూడా తన డెబ్యూతో పరవాలేదనిపించుకుంది. కీలక పాత్రలు పోషించిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర అందరి పాత్రలు సినిమాలో ఎంతోకొంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. తమన్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్‌కు ప్రాణంగా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story