Amritsar: ఇటలీ నుండి అమృత్‌ సర్ వచ్చిన ఫ్లైట్.. 125 మంది ప్రయాణికులకు కరోనా..

Amritsar: ఇటలీ నుండి అమృత్‌ సర్ వచ్చిన ఫ్లైట్.. 125 మంది ప్రయాణికులకు కరోనా..
Amritsar: ఇప్పటికే కరోనా కేసులు ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Amritsar: ఇప్పటికే కరోనా కేసులు ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినా ఇంకా అంతర్జాతీయ విమానాలపై, ప్రయాణికులపై పూర్తిగా ఆంక్షలు విధించలేదు. అందుకే ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణించే ప్రయాణికుల వల్లే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని భావిస్తున్నారు ప్రజలు. తాజాగా ఇటలీ నుండి అమృత్‌సర్ వచ్చిన ఓ విమానంలో ఏకంగా 125 మందికి కరోనా సోకినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

దాదాపు మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఇటలీ నుండి అమృత్ సర్‌కు ఓ ఛార్టెడ్ ఫ్లైట్ వచ్చింది. అందులో 179మంది ప్రయాణికులు, అందులో 19 మంది చిన్నారులు ఉన్నారు. ఇటలీలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఎప్పలాగానే ఆ ప్రయాణికులకు కోవిడ్ టెస్ట్‌ను నిర్వహించారు. అయితే వారిలో ఏకంగా 125 మంది పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.

ఇటలీలో చాలామందికి కోవిడ్ నెగిటివ్ వచ్చినా కూడా ఇక్కడ వారికి పాజిటివ్ రావడానికి కారణాలు ఏంటని ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన చాలామంది ఎయిర్‌పోర్ట్ నుండి బయటికి వెళ్లడానికి ప్రయత్నించారు కానీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వారిని అడ్డుకుని క్వారంటీన్‌కు తరలించారు. వీరిలో ఎవరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనే దానిపై పరీక్షలు త్వరలో జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story