Supreme Court Of India: సుప్రీంకోర్టులో ఏకంగా 150 మందికి కరోనా నిర్దారణ..

Supreme Court Of India: సుప్రీంకోర్టులో ఏకంగా 150 మందికి కరోనా నిర్దారణ..
Supreme Court Of India: గడచిన ఒక్క రోజు వ్యవధిలో ఢిల్లీలో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

Supreme Court Of India: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన ఒక్క రోజు వ్యవధిలో ఢిల్లీలో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ కరోనా కలకలం చెలరేగింది. సుప్రీంకోర్టులో ఏకంగా 150 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

సుప్రీంకోర్టులో మొత్తం 3 వేల మంది వరకు సిబ్బంది ఉంటారు. ఒక్కసారే భారీగా కేసులు నమోదు కావడంతో సుప్రీంకోర్టు ఆవరణలోనే ప్రత్యేకంగా కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఉద్ధృతికి తోడు ఒమిక్రాన్ కూడా తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండడంతో ఈ నెల మొదటి వారం నుంచి ఆన్ లైన్ విచారణలు చేపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story