Punjab: పంజాబ్‌లో తవ్వకాలు.. 282 సైనికుల అస్థిపంజరాలు లభ్యం..

Punjab: పంజాబ్‌లో తవ్వకాలు.. 282 సైనికుల అస్థిపంజరాలు లభ్యం..
Punjab: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ పురాతన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి.

Punjab: ఇండియా.. బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో ఏళ్లు పోరాడింది. ఆ పోరాటంలో ఎంతోమంది సైనికులు, సామాన్యులు ప్రాణత్యాగాలు కూడా చేశారు. అలా ఎంతమంది మరణించారో ఇప్పటికీ సరైన లెక్కే లేదు. కానీ మొదటిసారి ఇండియా.. బ్రిటిష్‌తో స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమయంలో మరణించిన 200కు పైగా సైనికుల అస్థిపంజరాలు అమృత్‌సర్‌‌లో లభించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

బ్రిటిషర్లు వచ్చి ఇండియాను ఆక్రమించుకున్న తర్వాత చాలాకాలం వరకు యుద్ధంలాంటిది ఏమీ జరగలేదు. కానీ మొదటిసారి 1857లో పంది, గొడ్డు మాంసంతో చేసిన మందుగుండును వినియోగించమని బ్రిటిషర్లు చెప్పినప్పుడు దానికి చాలామంది భారతీయులు వ్యతిరేకత చూపించారు.. తిరగబడ్డారు. అలా తిరబడిన వారందరినీ చంపి ఓ బావిలో పడేశారు బ్రిటిషర్లు.

ఇటీవల పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ పురాతన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవి దాదాపు 282 మంది భారతీయ సైనికులకు చెందిన అస్థిపంజరాలని అధికారులు అంటున్నారు. మొదటిసారి బ్రిటిషర్లపై భారతీయులు చేసిన తిరుగుబాటులో సమయంలో జరిగిన యుద్ధంలోనే వీరందరు మరణించినట్టు నిర్ధారించారు.


Tags

Read MoreRead Less
Next Story