B J Puttaswamy: సన్యాసం తీసుకోనున్న బీజేపీ మాజీ ఎమ్మెల్సీ.. ఇక రాజకీయాలకు గుడ్‌బై..

B J Puttaswamy: సన్యాసం తీసుకోనున్న బీజేపీ మాజీ ఎమ్మెల్సీ.. ఇక రాజకీయాలకు గుడ్‌బై..
B J Puttaswamy: మే 6న పుట్టస్వామి సన్యాసం స్వీకరించనున్నారు. రాజకీయాల్లో అదే ఆయనకు చివరి రోజు కానుంది.

B J Puttaswamy: రాజకీయాల్లో కొన్నాళ్లు రాణించిన తర్వాత సన్యాసం తీసుకోవడం వంటివి ఇదివరకు జరుగుతుండేవి. ఇప్పుడు కూడా కొందరు నాయకులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాత్రం ఏకంగా సన్యాస దీక్ష తీసుకొని పూర్తిగా రాజకీయ జీవితానికి, వ్యక్తిగత సౌకర్యాలకు దూరమయిపోవాలని నిర్ణయించుకున్నారు.

కర్ణాటకలో చాలాకాలం కాంగ్రెస్‌లో అనేక పదవుల్లో ఎన్నో విధాలుగా ప్రజలకు సేవలు అందించిన బీజే పుట్టస్వామి కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు. అక్కడ ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్ హోదా కూడా దక్కింది. అయితే ఇటీవల ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పుట్టస్వామి.. తాను సన్యాసం తీసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

మే 6న పుట్టస్వామి సన్యాసం స్వీకరించనున్నారు. రాజకీయాల్లో అదే ఆయనకు చివరి రోజు కానుంది. రాజరాజేశ్వరి దేవస్థానానికి చెందిన కైలా మఠాధిపతి జయేంద్ర తీర్థపురి స్వామిజీ నుంచి ఆయన సన్యాస దీక్షను స్వీకరించనున్నారు. ఇక మే 15న తైలేశ్వర గాణిగర మహాసంస్థానానికి తొలి పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకుంటారు పుట్టస్వామి. ఈ విషయాలన్నీ స్వయంగా ఆయనే మీడియాతో పంచుకోవడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story