Corona R Value: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఆర్‌ వాల్యూ.. నాలుగో వేవ్‌ తప్పదా..?

Corona R Value: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఆర్‌ వాల్యూ.. నాలుగో వేవ్‌ తప్పదా..?
Corona R Value: రెండేళ్లుగా హడలెత్తించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతా రిలాక్స్‌ అవుతున్నారు.

Corona R Value: రెండేళ్లుగా హడలెత్తించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతా రిలాక్స్‌ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా దాదాపు కరోనాను మరిచిపోయి రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అయితే కరోనా ఖేల్‌ఖతమేనా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు. ఇటీవలికాలంలో కరోనా కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడెక్టివ్‌ వాల్యూ మరోసారి భారత్‌ను భయపెడుతోంది. ఆర్‌ వాల్యూ పెరుగుతుండటం కరోనా నాలుగోవేవ్‌కు సంకేతమా అన్న డౌట్స్‌ నెలకొన్నాయి.

కొద్ది వారాలుగా దేశంలో ఆర్‌-ఫ్యాక్టర్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. మూడు నెలల్లో మొదటిసారి ఆర్‌-వాల్యూ ఒకటి దాటింది. ఆర్‌ వాల్యూ ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్లేనని చెన్నైకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌ వెల్లడించింది. ఏప్రిల్‌ 5-11 తేదీల మధ్య 0.93గా ఉన్న ఆర్‌ వాల్యూ, తరువాతి వారం రోజుల్లో 1.07 చేరినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆర్‌ వాల్యూ పెరుగుదలకు ఢిల్లీలో కేసుల విజృంభణతోపాటు హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటకలో పెరుగుతున్న కేసులు కారణంగా శాస్త్రేవేత్త సితాభ్ర సిన్హా తెలిపారు. దేశ రాజధానితో పాటు యూపీలో ఆర్‌ వాల్యూ ప్రస్తుతం 2గా ఉంది. మెట్రో నగరాలు ముంబయి, బెంగళూరు, చెన్నైలోనూ ఆర్‌ వాల్యూ ఒకటి దాటింది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ పెరుగుదలను ఆర్‌-ఫ్యాక్టర్‌ ద్వారా అంచనా వేస్తారు. సాధారణంగా ఇది ఒకటిగా ఉంటే వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకుతున్నట్లు పరిగణిస్తారు.

దేశంలో మరోసారి రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4 లక్షల 21వేల మందికి కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా.. 2 వేల 67 మందికి వైరస్ సోకినట్లు తేలింది.ఢిల్లీలో 632, కేరళలో488 కేసులు నమోదయ్యాయి. ముంబయిలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు 85 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాలు కొవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story