Covid Cases: వచ్చేవారం నుండి రోజుకు 4-8 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం..!

Covid Cases: వచ్చేవారం నుండి రోజుకు 4-8 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం..!
Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కల్లోలం రేపుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విశ్వరూపం చూపిస్తోంది.

Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కల్లోలం రేపుతోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విశ్వరూపం చూపిస్తోంది. వారం రోజుల వ్యవధిలో కేసుల తీవ్రత 71శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కొంత ఊరటనిచ్చేలా.. కొత్తగా నమోదైన మరణాల సంఖ్య 10శాతం తగ్గాయి. గత వారం రోజులుగా 95 లక్షల కేసులు నమోదు కాగా.. 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా అమెరికాలో కేసులు 100శాతం పెరగ్గా, ఆగ్నేయాసియాలో 78శాతం, యూరప్‌లో 65శాతం, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 40శాతం, పశ్చిమ పసిఫిక్‌లో 38శాతం, ఆఫ్రికాలో 7శాతం కేసులు పెరిగినట్లు WHO తెలిపింది. దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. గత 10 రోజుల వ్యవధిలో కేసులు 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి.

కొత్తగా 1,17,100 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ ఉద్ధృతిలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా 36,265 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఒక్క ముంబయి నగరంలోనే 20,181 కేసులు బయటపడ్డాయి. పశ్చిమబెంగాల్‌లో 15,421, డిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు ఏకంగా 15.34 శాతానికి పెరిగింది.

ప్రపంచాన్ని మూడో వేవ్‌కు తీసుకెళ్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా దేశంలో పెరుగుతున్నాయి. 377మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దీంతో ఒమిక్రాన్‌ కేసులు 3,007కి చేరాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 876మంది, ఢిల్లీలో 465మంది ఒమిక్రాన్‌ బాధితులు ఉన్నారు. అటు కర్నాటకలో ఒక్కరోజే 107మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు 333కు పెరిగాయి. దేశ్యాప్తంగా ఒమిక్రాన్‌ బాధితుల్లో 1,199 మంది కోలుకున్నారు.

జనవరి చివరి నాటికి కరోనా ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతేడాది సెకండ్‌ వేవ్‌ కంటే రెట్టింపు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు నాటికి దేశంలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరొచ్చు. రోజుకు 4 నుంచి 8 లక్షల కొత్త కేసులు నమోదయ్యే అవకాశముంది. ఒక్క ముంబయి, దిల్లీ నగరాల్లోనే రోజకు 30వేల నుంచి 50వేల కేసులు రావొచ్చు.

వైరస్‌ వ్యాప్తికి ధీటుగా దేశంలో టీకా పంపిణీ జరుగుతోంది. తొలి ఐదు రోజుల్లోనే దేశవ్యాప్తంగా కోటి 50లక్షల మంది టీనేజర్లు తొలి డోసు తీసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లలోనే వ్యాక్సిన్లు వేస్తున్నారు. దీంతో దేశ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీ 150కోట్ల మైలు రాయిని దాటింది. దీనిపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లు, వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story