Covid Restrictions: నైట్ కర్ఫ్యూ.. వీకెండ్ లాక్‌డౌన్.. అయినా తగ్గని కరోనా వ్యాప్తి..

Covid Restrictions: నైట్ కర్ఫ్యూ.. వీకెండ్ లాక్‌డౌన్.. అయినా తగ్గని కరోనా వ్యాప్తి..
Covid Restrictions: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

Covid Restrictions: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండగా.. మరికొన్ని వారాంతపు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. అటు.. వ్యాక్సినేషన్​పైనా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నెల 3నుంచి దేశంలో 15-18 ఏళ్లవారికి కూడా టీకా​ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వ్యాక్సిన్‌ తీసుకోని పిల్లలను పాఠశాలలోకి అనుమతించబోమని హరియాణా ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉండగా.. తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్​ విజ్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 లక్షలకుపైగా అర్హులైన పిల్లలు టీకా తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. వారంతా వ్యాక్సిన్​ తీసుకునేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు​. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.

పెద్దలతోపాటు టీనేజర్లకు కూడా టీకాలు వేగంగా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పదిరోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు కొవిడ్‌ టీకా పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్రాల వద్ద పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకాల కార్యక్రమం నిర్వర్తిస్తున్నామని.. ఇప్పటి వరకు దేశంలో రెండో డోసు వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తయిందని ప్రధాని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story