Farm Laws: సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ నివేదిక..

Farm Laws: సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ నివేదిక..
Farm Laws: మోదీ సర్కారు తీసుకొచ్చిన సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతమైంది.

Farm Laws: మోదీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతమైంది. సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు అందులో వెల్లడైంది. అయితే సాగుచట్టాలను కేంద్రం రద్దు చేయడంతో ఈ నివేదికకు ప్రాధాన్యం లేకుండా పోయింది.

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక గతేడాది మార్చి 19నే సుప్రీంకోర్టుకు చేరింది. అందులో కీలక అంశాలను కమిటీ సిఫార్సు చేసింది. ముఖ్యంగా కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యుడైన అనిల్ ఘన్వాట్ ఈ వివరాలను వెల్లడించారు.

2022 మార్చి19న సుప్రీంకోర్టుకు ఈ నివేదిక సమర్పించామని, దీన్ని బయటపెట్టాలని మూడుసార్లు లేఖలు రాశామన్నారు అనిల్‌ ఘన్వాట్‌.అయితే ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నివేదికను బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ...ఇప్పటికే సాగు చట్టాలు రద్దైనందున దీనిలి ఎలాంటి ప్రాధాన్యం లేదున్నారు. అయితే... భవిష్యత్తులో సాగు చట్టాలు చేసేటప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story