KCR: ప్రాణం పోయినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టను: కేసీఆర్

KCR: ప్రాణం పోయినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టను: కేసీఆర్
KCR: ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా గడిపారు.

KCR: ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీబిజీగా గడిపారు. వరుసగా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఢీల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌సింగ్ తో కలిసి.. సాగుచట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొని మరణించిన రైతుకుటుంబాలకు, గాల్వాన్‌ సరిహద్దు ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్ధిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా 600 కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని.. రైతుల కుటుంబాలకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లైనా ఇంకా ఇలాంటి సమావేశాలు నిర్వహించుకోవడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్. ఈ సభను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని చూస్తుందని.. కానీ తన ప్రాణం పోయినా ఆ పనిచేయనన్నారు.

క‌నీస మ‌ద్దతు ధ‌ర విష‌యంలో ఏ ప్రభుత్వమైతే చ‌ట్టబ‌ద్ధత క‌ల్పిస్తుందో… వారికే మ‌ద్దతివ్వాలి అన్నారు. అలాంటి ఐక్యమత్యం దేశవ్యాప్తంగా ఉన్న రైతుల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం రైతు ఉద్యమానికి అండగా ఉంటుందన్నారు. రైతుల ఉద్యమానికి తమతోపాటు చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగారైతులు పోరాటంచేశారని గుర్తుచేశారు. వారుచేసిన ఉద్యమం పంజాబ్, హరియాణాకు చెందినది మాత్రమే కాదన్నారు.

యావత్ దేశ ప్రయోజనాలకోసం రైతులు పోరాడారని కేజ్రీవాల్ అన్నారు. రైతు కొడుకు రైతు కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సాగుచట్టాలపై రైతులు చేసిన ఉద్యమానికి దేశంలోని చాలా రాష్ట్రాలు అండగా నిలిచాయని గుర్తుచేశారు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతుగా నిలిచారని కొనియాడారు. పంజాబీ రైతులు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా తమపోరాటాన్ని కొనసాగించారని ప్రశంసించారు. వారి పోరాటం మరువలేనిదన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ .. ఢిల్లీసీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

సుమారు 2 గంటలపాటు దేశ రాజకీయాలపై చర్చించారు. కేజ్రీవాల్‌ ఇంట్లో భోజనం చేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి విషయమై చర్చించారు. అటు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయమై పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు. దేశంలో త్వరలో సంచనలం జరగబోతుందన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీసీఎం కేజ్రీవాల్‌తో కలిసి చండీగఢ్‌కు చేరుకున్నారు. సాగుచట్టాల ఉద్యమంలో పాల్గొని మరణించిన రైతు కుటుంబాలను, అమరజవాన్ల కుటుంబాలను పరామర్శించారు.

చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియానికిచేరుకున్న ఇద్దరు ముఖ్యమంత్రులతకు రైతులు, సైనికుల కుటుంబాల వారు ఘనంగా స్వాగతం పలికారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్‌ రైతులు, జవాన్ల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఠాగూర్ ఆడిటోరియంలో సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్, ఢిల్లీసీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశంలోని తాజా రాజకీయాలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై చర్చించారు. అనంతరం ఢిల్లీసీఎంతో కలిసి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story