Corona Update: 15 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో..

Corona Update: 15 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో..
Corona Update: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షల వైపు పరుగులు తీస్తోంది.

Corona Update: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3 లక్షల వైపు పరుగులు తీస్తోంది. నిన్న కొత్తగా 2 లక్షల 71వేల మందికి పైగా కరోనా సోకింది. రేపు, ఎల్లుండిలో ఈ సంఖ్య మూడు లక్షలకు చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఒమిక్రాన్‌ కూడా దేశ నలువైపులా విస్తరిస్తోంది. నిన్నటితో కలిపి దేశంలో 7వేలకు పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల 50వేలు దాటింది.

ఇక మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం మహారాష్ట్రలో 42 వేల 462 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. మరో 23 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 64 వేలు దాటింది. కర్ణాటకలోనూ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కొత్తగా కర్ణాటకలో 32 వేల 793 మంది వైరస్ బారిన పడ్డారు.

కర్ణాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 69 వేలకు పెరిగింది. ఇక కొత్తగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 19 వేల 64 మంది కరోనా బారిన పడగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 55 వేలకు పెరిగింది. పాజిటివిటీ రేటు 29.52 శాతంగా ఉంది. తమిళనాడులో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

శనివారం 23 వేల 989 మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. కరోనా కారణంగా తమిళనాడులో 11 మంది చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 31 వేలు దాటింది. కేరళలో కొత్తగా 17 వేల 755 మంది కరోనా బారిన పడగా..17 మంది ప్రాణఆలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకూ కేరళలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 వేలు దాటింది.

ఇక పార్లమెంటులోనూ కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటివరకూ 850 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నా డ్యూటీకి రావొద్దని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

తెలంగాణలో కొత్తగా 19 వందల 63 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 22 వేల యాక్టివ్ కేసులున్నాయి.ఇక ఏపీలో ఒక్కరోజే 4 వేల 955 కేసులు నమోదు కాగా..ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story