Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ప్రమాదం.. రహదారిపై చిక్కుకున్న 10 వేల మంది ప్రయాణికులు..

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ప్రమాదం.. రహదారిపై చిక్కుకున్న 10 వేల మంది ప్రయాణికులు..
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఉండే పుణ్యక్షేత్రాలకు దేశవ్యాప్తంగా ఉండే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారన్న విషయం తెలిసిందే.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఉండే పుణ్యక్షేత్రాలకు దేశవ్యాప్తంగా ఉండే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారన్న విషయం తెలిసిందే. అయితే కొండలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ ఇప్పటికీ పలుమార్లు పలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదంలో 10 వేల మంది భక్తులు ఎటు వెళ్లాలో తెలియక మధ్యలో చిక్కుకుపోయారు. అందులో కొందరు అటువైపుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు.

ఉత్తరాఖండ్‌లో యమునోత్రి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆ మార్గంలో ఉన్న రక్షణ గోడ కూలడంతో అటువైపుగా ప్రయాణాలు కొనసాగించే వీలు లేకుండా అయిపోయింది. దీంతో అటువైపుగా వెళ్లే 10 వేల మంది పరిస్థితి అయోమయంగా ఉంది. ఆ దారిని క్లియర్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడే పూర్తిగా ప్రయాణాలు కొనసాగించే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు ఎటు వెళ్లాలో తెలియక అక్కడే చిక్కుకుపోయారు. దగ్గర ప్రాంతాల నుండి వచ్చిన వారిని అక్కడి నుండి తరలించే చర్యలను అధికారులు మొదలుపెట్టారు. కానీ దూర ప్రాంతాల నుండి పెద్ద వాహనాల్లో వచ్చినవారే పరిస్థితి అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రధాన రహదారి మళ్లీ పునరుద్ధరణ జరగడానికి కనీసం మూడురోజులు పడతుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story