NFHS: ప్రస్తుతం దేశంలో 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే..?

NFHS: ప్రస్తుతం దేశంలో 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే..?
NFHS: ఒకప్పుడు 100 మంది అబ్బాయిలకు 90 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారిన లెక్కలు చెప్పేవారు.

NFHS: ఒకప్పుడు కడుపులో ఉన్నది మగపిల్లాడా? ఆడపిల్లా? అని ముందే పరీక్షలు చేయించుకుని.. ఒకవేళ ఆడపిల్ల అయితే పుట్టక ముందే ఆ పసికందు ప్రాణం తీసేవారు చాలామంది. కానీ మెల్లగా ప్రజల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఏం తేడా ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే జనాభా విషయంలో ఓ పెద్ద మార్పే చోటుచేసుకుంది.

ఒకప్పుడు 100 మంది అబ్బాయిలకు 90 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారిన లెక్కలు చెప్పేవారు. కానీ చాలా సంవత్సరాల తరువాత ఈ లెక్కల్లో మార్పు వచ్చింది. భారతదేశంలో స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిలో మార్పు వచ్చి చాలాకాలమే అయ్యింది. ఎప్పటినుండి అయినా మగవారి సంఖ్య ఎక్కువగా, ఆడవారి సంఖ్య తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు వీటిలో వచ్చిన మార్పు మంచి సూచననే ఇస్తోంది.

ఇటీవల స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఓ నివేదికను ఇచ్చింది. ఇందులో స్త్రీ పురుషుల నిష్పత్తి 1020,1000గా ఉంది. అంటే 1000 మంది పురుషులకు 1020 మంది స్త్రీలు ఉన్నారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ లోక్‌సభలో చెప్తూ.. ఇది సంతోషించాల్సిన పరిణామం అన్నారు.



Tags

Read MoreRead Less
Next Story