Punjab DGP: ప్రధాని మోదీ సెక్యూరిటీ ఇష్యూ.. పంజాబ్ డీజీపీపై వేటు

Punjab DGP: ప్రధాని మోదీ సెక్యూరిటీ ఇష్యూ.. పంజాబ్ డీజీపీపై వేటు
Punjab DGP: పంజాబ్‌ కొత్త డీజీపీగా వీరేష్‌ కుమార్‌ బావరాను నియమించింది కేంద్రం.

Punjab DGP: పంజాబ్‌ కొత్త డీజీపీగా వీరేష్‌ కుమార్‌ బావరాను నియమించింది కేంద్రం. ఈ నెల 5న ప్రధాని మోదీ సెక్యూరిటీ వైఫల్యం కారణంగా.. డీజీపీగా ఉన్న సిద్ధార్ధ చటోపాధ్యాయను తొలగించింది కేంద్రం. ఆ స్థానంలో వీకే బావరాను కొత్త డీజీపీగా నియమించింది. పంజాబ్‌ ఎన్నికల తేదీని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే.. ఆ రాష్ట్రంలో కొత్త డీజీపీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వీరేష్‌ కుమార్ బావ్‌రా.. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌. పంజాబ్‌ డీజీపీగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పంపిన ప్యానల్‌లో.. డీజీపీ దినకర్‌ గుప్తా, వీరేష్‌ కుమార్‌ బావరా, ప్రబోద్ కుమార్‌ల పేర్లను ప్రతిపాదించగా. ఇందులో వీకే బావరాను కొత్త డీజీపీగా నియమించింది కేంద్రం. చన్నీ ప్రభుత్వ హయంలో.. మూడో డీజీపీగా వీరేష్‌ కుమార్‌ బవరా బాధ్యతలు తీసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story