Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..

Omicron: ఒమిక్రాన్ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..
Omicron: ఇవాళ్టి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.

Omicron: ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే రెండు వారాల పాటు విచారణను వర్చువల్‌గా నిర్వహించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం సర్క్యులర్‌ జారీ చేసింది.

ప్రామాణిక పనితీరు విధానంగురించి గత ఏడాది అక్టోబరు 7న జారీ చేసిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అందులో పేర్కొంది. మహమ్మారి కారణంగా.. 2020 మార్చి నుంచీ సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలోనే కేసుల్ని విచారించింది.

అయితే.. బార్‌ సంఘాలు, న్యాయవాదుల డిమాండ్‌ మేరకు గత ఏడాది అక్టోబరు 7న కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అవసరమైన కేసులను బుధ, గురువారాల్లో ప్రత్యక్షంగా కోర్టులోనే చేపడతామని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసుల పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేసింది.

Tags

Read MoreRead Less
Next Story