UP Election 2022: యూపీలో మళ్లీ బీజేపీదే రాజ్యం..! సర్వే రిజల్ట్స్‌లో వెల్లడి..

UP Election 2022: యూపీలో మళ్లీ బీజేపీదే రాజ్యం..! సర్వే రిజల్ట్స్‌లో వెల్లడి..
UP Election 2022: దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే యూపీ ఎలక్షన్స్‌పైనే తాజాగా అందరి నజర్ వెేళ్తోంది.

UP Election 2022 : దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే యూపీ ఎలక్షన్స్‌పైనే తాజాగా అందరి నజర్ వెేళ్తోంది. రెండు, మూడు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒపీనియన్ పోల్ సర్వే.. ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది. మరోమారు కమల దళమే అధికారం దక్కించుకుంటుందని అంచనా వేసింది. యూపీలో బీజేపీ నేతృత్వంలోని కూటమి 230 నుంచి 249 స్థానాల‌ు గెలుచుకుంటుందని పోల్ స‌ర్వే వెల్లడించింది.

అత్యధిక స్థానాలతో వ‌రుస‌గా రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ రికార్డులు సృష్టిస్తార‌ని స్పష్టం చేసింది ఒపీనియన్ పోల్ సర్వే . ఇదే జ‌రిగితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. 36 ఏళ్ల తర్వాత వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయిన వ్యక్తిగా యోగి రికార్డుకెక్కే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎస్పీ గట్టిపోటీనే ఇవ్వనున్నట్లు సర్వే వెల్లడించింది.

48 స్థానాలున్న ఎస్పీ కూటమి తన బలం పుంజుకోని 137 నుంచి 152 స్థానాల్లో విజయం సాధించొచ్చని టైమ్స్ నౌ పోల్ అంచనా వేసింది. మరోవైపు యూపీలో ఇతర పార్టీల ప్రభావం తగినంత ఉండబోదని ఒపీనియన్ పోల్‌లో టైమ్స్ నౌ స్పష్టం చేసింది. గత ఎన్నికలో 19 స్థానాలు సాధించిన మాయావతి ఆధర్యంలోని BSP... మరింత బలహీనపడనున్నట్లు పేర్కొంది.

కేవ‌లం 9 నుంచి 14 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని ఒపీనియన్ పోల్‌ సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే ప‌రిమితమై..4 నుంచి 7 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉన్నట్లు అంచ‌నా వేసింది. అటు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 38.6 శాతం ఓట్లు సాధించనున్నట్లు తెలిపిన పోల‌్ సర్వే.. అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ కూటమికి 34.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. గతంలో 22.2 శాతం ఉన్న బీఎస్పీ ఓటు బ్యాంకు.. ప్రస్తుతం 14.1 శాతానికి ప‌డిపోతుంద‌ని సర్వే స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story