UP Elections: ప్రశాంతంగా యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. కీలకంగా మారనున్న ఫలితాలు..

UP Elections: ప్రశాంతంగా యూపీ అసెంబ్లీ ఎన్నిక‌లు.. కీలకంగా మారనున్న ఫలితాలు..
UP Elections: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఆరోద‌శ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

UP Elections: యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఆరోద‌శ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరారు. మొత్తం 57 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుండగా, 626 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌... తన ఓటు హక్కును వినియోగిచుకున్నారు. గోరఖ్‌పూర్‌లో పోటీ చేస్తున్న యోగి.. కన్యానగర్‌ క్షేత్రలోని ప్రైమరీ స్కూల్‌లో ఓటేశారు.

మొత్తం ప‌ది జిల్లాల్లోని 57 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. బ‌ల‌రాంపూర్‌, సిద్ధార్ధ్‌న‌గ‌ర్‌, మ‌హ‌రాజ్‌గంజ్‌, ఖుషీన‌గ‌ర్‌, బ‌స్తి, సంత్ క‌బీర్‌న‌గ‌ర్‌, అంబేద్క‌ర్ న‌గ‌ర్‌, డియోరియా, బ‌లియా స‌హా యోగి స్వస్ధల‌మైన గోర‌ఖ్‌పూర్ జిల్లాల్లో ఓటింగ్ నడుస్తోంది. పూర్వాంచ‌ల్‌గా పేరొందిన తూర్పు యూపీలో ఆరోద‌శ పోలింగ్ కీలకంగా మారింది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆరో విడతలో కీలకమైన స్థానాలు ఉండటంతో పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. యూపీ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతుండగా.. చివరి విడత ఎన్నికలు ఈనెల7న జరగనున్నాయి. మార్చి పదిన కౌటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story