Varanasi: మజీదులో బయటపడిన శివలింగం.. సీల్ వేసి తనిఖీ చేస్తున్న అధికారులు..

Varanasi: మజీదులో బయటపడిన శివలింగం.. సీల్ వేసి తనిఖీ చేస్తున్న అధికారులు..
Varanasi: వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మజీదు ఉంది.

Varanasi: ఒక్కొక్కసారి పురాతన తవ్వకాల్లో లభించే వస్తువులు, ఆనవాళ్లు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మజీదులులాంటి చోటుల్లో హిందూ దేవుళ్ల ఆనవాళ్లు దొరకడం లాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి. తాజాగా వారణాసిలో మరోసారి అలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే వారణాసి కోర్టు దీనిపై త్వరగా చర్యలు తీసుకొని పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తోంది.

వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మజీదు ఉంది. ఇటీవల ఇక్కడ శివలింగం బయటపడింది. అంతే కాకుండా దాని చుట్టుపక్కలా ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆనవాళ్లు ఉండడం గమనార్హం. అయితే ఇక్కడ హిందువులు పూజ చేసుకోవడానికి అనుమతించాలని వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కమిషనర్, న్యాయవాదుల బృందం ఏర్పాటు చేసి మూడు రోజులుగా అక్కడ పరిశీలన చేపట్టింది.

మే 17లోగా ఈ శివలింగం గురించి పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని ఆ బృందాన్ని కోరింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మజీదులో శివలింగం పరిశీలన కొనసాగుతుండగా అక్కడ ఏ హింసకు ఆస్కారం లేకుండా ఆ చోటును సీల్ చేశారు అధికారులు. అంతే కాకుండా పోలీసుల బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story