Yogi Adityanath: ముఖ్యమంత్రిగా యోగీ ఆధిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..

Yogi Adityanath (tv5news.in)

Yogi Adityanath (tv5news.in)

Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు యోగీ ఆధిత్యనాథ్.

Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు యోగీ ఆధిత్యనాథ్. లక్నో ఎకానా స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హాజరవుతారని సమాచారం. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, RSS నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వాన పత్రం పంపినట్లు సమాచారం. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌, బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధిదారులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం.

ఇప్పటికే కేబినెట్‌ మంత్రుల పేర్లను కూడా బీజేపీ అధిష్టానం ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పరిశీలకులుగా పార్టీ తరపున అమిత్ షాను నియమించారు. జార్ఖండ్ మాజీ సీఎం రఘుబార్‌ దాస్ కూడా కో-అబ్జర్వర్‌గా నియమించబడ్డారు. ఇటీవల యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజార్టీ సాధించింది. మొత్తం 403 స్థానాలకు గానూ 255 స్థానాల్లో విజయం సాధించింది. 41.29 శాతం ఓట్‌ షేర్‌ను సంపాదించింది.

Tags

Read MoreRead Less
Next Story