Kerala: రెండు రోజులుగా కొండ చీలికలో ఇరుక్కున్న యువకుడు.. చివరిగా..

Kerala: రెండు రోజులుగా కొండ చీలికలో ఇరుక్కున్న యువకుడు.. చివరిగా..
Kerala: కేరళలోని ఓ కొండ చీలికలో ఇరుక్కుపోయిన యువకుడు బాబును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Kerala: కేరళలోని ఓ కొండ చీలికలో ఇరుక్కుపోయిన యువకుడు బాబును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయిన యువకుడిని సైన్యం రక్షించింది. గత సోమవారం నుంచి మంచి నీరు, ఆహారం లేకుండా.. కొండ చీలికలోనే పడిగాపులు పడుతున్న యువకుడు బాబు గురించి కేరళ సీఎం పినరయికి సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. సైన్యం సహాయం కోరారు.

ఇవాళ రంగంలోకి దిగిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ యువకుడిని కాపాడి తీసుకొచ్చారు. సోమవారం నాడు ట్రెక్కింగ్‌కు బయల్దేరిన ముగ్గురు యువకులు.. కేరళలోని పాలక్కాడ్ సమీపంలో ఉన్న ఓ కొండను ఎక్కేందుకు ప్రయత్నించారు. వీరిలో ఇద్దరు మాత్రం మధ్యలోనే ట్రెక్కింగ్‌ను విరమించుకున్నారు. బాబు మాత్రం కొండ శిఖరం చేరుకున్నాడు. కాని, ప్రమాదవశాత్తు కొండ పైనుంచి జారి, కొండ మధ్యలో ఉన్న ఈ చీలికలో చిక్కుకుపోయాడు.

సాయం కోసం అక్కడే రెండు రోజులుగా కూర్చుని ఉన్నాడు. బాబును రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ ప్రయత్నించింది. వారికి సాధ్యం కాకపోవడంతో.. బెంగళూరు నుంచి ఓ ప్రత్యేకదళం వెళ్లింది. తమిళనాడులోని వెల్లింగ్టన్‌ నుంచి మరో బృందం బయల్దేరింది. ఎయిర్‌ఫోర్స్‌ నుంచి పారా కమాండోలు సైతం వెళ్లారు. ఇలా మొత్తం 150 మంది సిబ్బంది కష్టపడి.. బాబును రక్షించారు.



Tags

Read MoreRead Less
Next Story