నవమిలోనూ 'తెలంగానం'

బుధవారం ప్రజలంతా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకొన్నా, తెలంగాణ వాదులు మాత్రం ఉద్యమాన్ని వీడలేదు. దీక్షా శిబిరాల్లోనే సీతారామ కల్యాణాలు జరిపారు. తమ ఆకాంక్ష త్వరగా నెరవేరేలా చూడాలని దేవుడిని వేడుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దీక్షలు 91వ రోజుకు చేరుకున్నాయి. వెల్దండ, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, గద్వాలలో రిలే దీక్షలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కోదాడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు జర్నలిస్టులు చేపట్టిన పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరుకుంది.
వచ్చే శాసనసభ ఉపఎన్నికల్లో రాజీనామాలు చేసినవారే మళ్లీ పోటీ చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ, తిప్పర్తి, చౌటుప్పల్, భువనగిరి, మోత్కూరులో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీమాంధ్ర నేతల కావూరి సాంబశివరావు, చిరంజీవి, లగడపాటి, రోశయ్య, మోహన్‌బాబు, నన్నపనేనిలను రావణులుగా పేర్కొంటూ శ్రీరామనవమి సందర్భంగా వారి దిష్టిబొమ్మలు దహనం చేశారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ డిఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణకు అనుకూలంగా సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చే శారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగాయి. మందమర్రి దీక్షల్లో ముస్లింలు పాల్గొన్నారు. రామక్రిష్ణాపూర్, మంచిర్యాల, శ్రీరాంపూర్, ఉట్నూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జైపూర్, లక్షెట్టిపేటలో దీక్షలు కొనసాగాయి. గురువారం నుంచి తెలంగాణ సాధ న యాత్రకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నది. వరంగల్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో కూడా ప్రత్యేక తెలం'గానం' వినిపించింది.
కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించిన విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సత్వరం ఏర్పాటు అయ్యేలా చూడాలని పూజలు చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరా ల్లో నిర్వహించిన శ్రీరామ కల్యాణోత్సవాల్లో కూడా ప్రత్యేక తెలంగాణ సత్వరం ఏర్పాటయ్యేలా చూడాలని కోరుతూ వినతి పత్రాలను విగ్రహాల ముందుంచారు. జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ బలిదానాలు ఆగటం లేదు. 'దళిత జాతిలో పుట్టి ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. కనీసం తెలంగాణ వస్తే అయినా ఉద్యోగం వస్తుందనుకున్నాను. శ్రీకృష్ణ కమిటీతో తెలంగాణ రాదు.
కనీసం నా చావుతోనైనా తెలంగాణ వస్తుందని ఆశిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్నాను' అంటూ ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడకు చెందిన నరాల తిరుమలేశ్ (28) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ భారతీయ జనతా పార్టీ సంతకాల సేకరణ ప్రారంభించింది. జగిత్యాల మం డలం మోతె గ్రామంలో తెలంగాణ కోసం ఆంజనేయ స్వాములవేషంలో బుధవారం ఇంటింటికి తిరుగుతూ సంతకాల సేకరణ నిర్వహించారు. కరీంనగర్, సెంటినరీకాలనీ, హుస్నాబాద్, భీమదేవరపల్లి, మెట్‌పల్లి, పెద్దపల్లి, సుల్తానాబాద్, తాడికల్, గోదావరిఖని, రామగుండం, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |