Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సానియాపై శివసేన ధ్వజం

AA

ఏప్రిల్ 2, 2010, శుక్రవారం

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంపై శివసేన ధ్వజమెత్తింది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. భారత్ తరఫున ఆడాలనుకుంటే సానియా భారతీయుడిని పెళ్లి చేసుకోవాలని అభిప్రాయపడింది. పాకిస్తానీని పెళ్లి చేసుకుని భారత్ తరఫున ఎలా ఆడుతావని శివసేన సానియాను ప్రశ్నించింది.
సానియా ఇక ఏ మాత్రం భారతీయురాలు కాదని, గుండె లోతుల్లో తాను భారతీయురాలిననే భావన ఉంటే సానియా పాకిస్తానీని వరుడిగా ఎంపిక చేసుకుని ఉండేది కాదని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. పెళ్లి తర్వాత సానియా పాకిస్తాన్ పౌరురాలు అవుతుందని, ఈ దేశాన్ని సానియా టెన్నిస్ బంతిలాగా వాడుకుంటోందని అన్నది.
Related Articles
Gallery