Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఇవాళ రాహుల్‌ గాంధీ జన్మదినం

AA

కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో ఓ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నారు. భావి భారత ప్రధానిగా కాంగ్రెస్‌ కార్యకర్తలతో నీరాజనాలందుకుంటున్న రాహుల్‌ ఇవాళ 40వ జన్మదినం జరుపుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ యువరాజు రాహుల్‌ గాంధీ నలబై ఒకటవ ఏట అడుగు పెడుతున్నారు.

నెహ్రూ కుటుంబం నుంచి నాల్గోతరం నాయకునిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన యువకెరటం రాహుల్‌గాంధీ. తండ్రి రాజీవ్‌గాంధీ రూపురేఖలతో పాటు రాజకీయ చతురత పుణికిపుచ్చుకున్న ఈ యువనేత జూన్‌ 19, 1970లో న్యూఢిల్లీలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోని మాడర్న్‌ స్కూల్ లో కొనసాగింది. హార్వర్డ్ లో కాలేజ్ లైఫ్ ప్రారంభించిన రాహుల్...1994 లో ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995 వ సంవత్సరంలో క్రేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజ్ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్ లో ఎంఫిల్ చేశారు.

అనంతరం మూడు సంవత్సరాల పాటు వివిధ సంస్థలలో ఉద్యోగం చేశారు. 2002 సంవత్సరంలో ముంబాయిలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ కంపెనీని ప్రారంభించాలని ఇండియా తిరిగివచ్చారు. అనంతరం తల్లి సోనియా గాంధీ కోరిక మెరకు 2004 మార్చ్ లో రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అటు తర్వాత 2006 జనవరిలో హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీట్ రాహుల్‌ రాజకీయ జీవితాన్ని మార్చేసింది.

అప్పటి నుంచి రాహుల్.. రాజకీయలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ప్రసంగాలు ఇవ్వడంలో తనదైన శైలితో ప్రజలను ఆకట్టుకున్నారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి రాహుల్‌ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. పేద ప్రజలతో మమేకమై వారిలో ఒకడిగా ఒదిగిపోయారు. ఇది ఇటు స్వపక్షంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థల చేత మెప్పు పొందాడు.

రాహుల్‌ గాంధీ రెండోసారి కూడా అమేథీ నుంచి పోటీచేసి గెలుపొందారు.ఈ ఎన్నికల సందర్భంగా రాహుల్ దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వారాల పాటు అలు పెరగకుండా విస్తృతంగా పర్యటించారు. ఆయన తల్లి సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ క్యాబినెట్‌లో పదవిని సైతం తీసుకోలేదు. దేశంలోని పరిస్థితులు, రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న రాహుల్‌ భవిష్యత్తులో భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించే దిశగా దూసుకెళ్తున్నారు.

ఎంతో వేగంతో భారత రాజకీయలను ప్రభావితం చేసిన రాహుల్‌ ఇంకా స్టిల్‌ బ్యాచ్యుల్‌గా ఉన్నారు. అయితే రాజకీయ ఆరంగెట్రంకు ముందు సహ విద్యార్థి... స్పెయిన్ గృహనిర్మాణ శిల్పి అయిన వెరోనికాతో ప్రేమాయణం కొనసాగించినా ఇది పాత కథ. ఇతని దృష్టి ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావటం లక్ష్యంగా పనిచేస్తున్నారు.

Watch Video.....
Related Articles
Gallery