Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
మమతా బెనర్జీ కొత్త ఎత్తులు

AA

* ఇంటా బైటా సత్తా చూపే వ్యూహాలు
* గోవా, మణిపూర్, యూపీలో పోటీ
* పేదల పక్షపాతిగా మన్ననలు
* సీట్లకంటే, ఓట్లకే ప్రాధాన్యం
* జాతీయ రాజకీయాల్లో కీరోల్


ఇంట గెల్చిన బెంగాల్ సిఎం మమతా బెనర్జీ రచ్చ గెలిచేందుకు తహతహలాడుతున్నారు. పేదల ఆశా జ్యోతిగా బెంగాల్ లో గుర్తింపు పొందిన ఆమె జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తులను ఏకం చేసే పనిలో పడ్డారు. అందుకే గోవా, మణిపూర్, యూపిలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కామ్రెడ్ల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేస్తున్నారు.

UP, మణిపూర్‌, గోవాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. కేవలం బెంగాల్‌కే పరిమితం కాకుండా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభావాన్ని నిరూపించుకోనున్నారు. గోవా, మణిపూర్, యూపిలో TMC అభ్యర్ధులను బరిలోకి నింపింది. సీట్లకంటే, ఓట్లు సాధిస్తే తమ పార్టీకి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభిస్తుందని మమత అంచనా. ఇందు కోసం యూపి మూడో దశ ఎన్నికల్లో జెడియుతో తృణమూల్ పొత్తు కుదుర్చుకోనుంది. తద్వారా జాతీయ రాజకీయాల్లో తాము మిగతా పార్టీలకు తీసిపోమని తృణమూల్ కాంగ్రెస్ నిరూపించనుంది.

గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్ కు TMC గట్టిపోటీ ఇచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ స్ధాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని మమతా బెనర్జీ గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే యూపిఎతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది TMC. పెట్రో ధరల పెంపును అడ్డుకుని పేదల పక్షపాతిగా బెంగాల్ సిఎం మన్ననలు పొందారు.ఈ నేపధ్యంలో రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పలు పెండింగ్ బిల్లులకు యూపిఎ ఆమోద ముద్రవేయాల్సి వుంది.

వివాదాస్పద భూసేకరణ బిల్లు, పెన్షన్ బిల్లు, రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులను మమతా బెనర్జీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తృణమూల్ వైఖరి చూస్తుంటే జాతీయ స్ధాయిలో యూపిఎకు వ్యతిరేకంగా బిజెపి, తదితర పార్టీల మద్దతుతో కేంద్ర సర్కార్ కు చుక్కలు చూపేందుకు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. మమత తాజా పరిణామాలపై UPA ఎలా రియాక్ట్‌ అవుతుందనేది ఆసక్తి కరంగా మారింది.

Published Date : Thursday, 2/2/2012 6:15 PM IST
Related Articles
Gallery