2జీ స్పెక్ట్రం లోని 121 లైసెన్సుల రద్దుకు సుప్రీం ఆదేశం
.jpg)
* ప్రకంపనలు రేపుతున్న సుప్రీంకోర్టు తీర్పు
* కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలయుద్ధం
* తలలు పట్టుకుంటున్న కస్టమర్లు, కంపెనీలు
* స్పెక్ట్రం కేటాయింపులన్నీ తప్పుల తడకేనన్న సుప్రీం
* 121 లైసెన్సుల రద్దుకు సుప్రీం ఆదేశాలు
* రెండునెలల్లోగా కొత్త లైసెన్సులు ఇవ్వాలని సూచన
* సుప్రీం తీర్పుపై బీజేపీ హర్షం
* కిందపడ్డా పై చేయి అంటున్న కాంగ్రెస్
* ఇదంతా ఎన్డీయే విధానాల ఫలితమని విమర్శ
* కొత్త లైసెన్సుల జారీకి సన్నాహాలు
* సుప్రీం తీర్పుతో కస్టమర్లు, కంపెనీల బేజారు
* ఇబ్బందులు ఎదుర్కోనున్న 9 కోట్ల కస్టమర్లు
* కంపెనీల పరిస్థితి మరింత దారుణం
* అవుట్‌లెట్లు, ఉద్యోగులు, ప్రచారంపై కోట్లాది ఖర్చు
* తమ పరిస్థితి ఏంటని వాపోతున్న వ్యాపారులు
* అంతర్జాతీయంగా భారత పరువుకు భంగమే
2G స్పెక్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు అన్ని వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టంటూ.. బీజేపీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతుండగా.. ఇది బీజేపీ అవలంభించిన విధానాల ఫలితమేనని కాంగ్రెస్ కవర్ చేసుకుంటోంది. అటు ఉన్నపళంగా లైసెన్సులు రద్దైతే తమ పరిస్థితేంటని.. అటు కంపెనీలు, ఇటు కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు. యూపీయే హయాంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులన్నీ తప్పుల తడకే అని నిర్ధారించిన సుప్రీంకోర్టు.. ఇందులో భాగంగా జారీ చేసిన 121 లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని టెలికాం శాఖను ఆదేశించింది.
రెండు నెలల్లోగా కొత్త లైసెన్సులు జారీ చేయాలని సూచించింది. ఈ తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం ఇప్పుడు చెప్పిన విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే ఉన్నామని పార్టీ నేతలన్నారు. ఈ అవినీతికి బాధ్యులైన రాజా... ఆయనకు సహకరించిన చిదంబరంను శిక్షించాలని కోరుతున్నారు. ఈ మొత్తం ఉదంతంపై ప్రధాని, సోనియా వివరణ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ మాత్రం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. ఇదంతా ఎన్డీయే సర్కారు విధానాల చలవంటూ విమర్శించింది.
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే విధానం ఎన్డీయే హయాంలోనే జరిగిందని.. కోర్టు దాన్నే తప్పుపట్టిందని చెప్పుకొచ్చింది. మరోవైపు,. కోర్టు ఆదేశాల మేరకు పాత లైసెన్సులు రద్దు చేసి... కొత్తవి జారీ చేసే పనిలో పడింది. రెండు నెలల్లోగానే ఈ తతంగమంతా పూర్తి చేయాల్సి రావడం సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మరోవైపు కోర్టు తీర్పుపై అటు కస్టమర్లు, ఇటు కంపెనీలు తలలు పట్టుకుంటున్నాయి. 2008 లో జారీ అయిన 2G స్పెక్ట్రం ద్వారా.. సుమారు 9 కోట్ల కస్టమర్లకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన మొబైల్ పోర్టబులిటీ ద్వారా వీరికి కొంత ఊరట లభించనున్నా.... కంపెనీల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. రద్దైన 121 లైసెన్సుల ఆధారంగా ఎన్నో కంపెనీలు భారీ ఎత్తున వ్యాపార విస్తరణ చేపట్టాయి. దేశవ్యాప్తంగా అనేక అవుట్‌లెట్లను ఏర్పాటు చేసి.. వేలాది మందికి ఉద్యోగాలిచ్చాయి. కోట్ల రూపాయలు వ్యాపారం కోసం ఖర్చు చేశాయి. ప్రభుత్వంలోని కొందరి చేతగానితనం వల్ల తాము నష్టాలు భరించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అటు అంతర్జాతీయంగా కూడా ఈ వ్యవహారం భారత పరువుకు భంగం కలిగించే ప్రమాదముందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Published Date : Friday, 3/2/2012 10:34 AM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |