Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి బిజెపి సీనియర్ నేతల డుమ్మా

AA

* పార్టీశ్రేణుల్లో అసంతృప్తి సెగలు
* గడ్కారీ ఒంటెద్దు పోకడపై సీనియర్ల కినుక
* ఉమాభారతిని ప్రొత్సహిస్తున్నారని మండిపాటు
* బీజేపీలో కాంగ్రెస్‌ కోటా రాజకీయాల కలకలం
* 200 నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు కీలకం
* నరేంద్రమోడీ ప్రచారానికి రావాలని శ్రేణుల ఆకాంక్ష


2014 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఓ వైపు జరుగుతుంటే.. B.J.P నాయకులు మాత్రం అంతర్గత కుమ్ములాటల్లో బిజీగా వున్నారు. ప్రచారానికి పార్టీ కీలక నేతలు హాజరు కాకపోవటం శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధాని పదవి అభ్యర్ధిగా ఇంటా బైటా చెప్పుకుంటున్న గుజరాత్ సిఎం నరేంద్రమోడీ ప్రచారానికి రాకపోవడం ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

B.J.P కి కఠినపరీక్షగా మారిన 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడంపై పార్టీశ్రేణులు భగ్గు మంటున్నాయి. విపక్ష నేత సుష్మా స్వరాజ్ సైతం B.J.P చీఫ్ నితిన్ గడ్కారీ ఒంటెద్దు పోకడపై అలిగి ప్రచారానికి దూరంగా వున్నారు. ఇందుకు అనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారని పార్టీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. యూపీలో కళంకిత నేత బాబూసింగ్‌ కుష్వాహాను పార్టీలోకి చేర్చుకోవటంపై సీనియర్లు కినుక వహించారు.

పైగా యూపీలో ఉమాభారతిని బుందేల్ ఖండ్ నుంచి పోటీకి అనుమతించి గడ్కారీ పొరపాటు చేశారని సీనియర్ నేత రాజ్ నాధ్ సింగ్, సుష్మా స్వరాజ్ అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. బ్రాహ్మణుల సంఖ్య గణనీయంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కల్రాజ్‌ మిశ్రాకు మంచి ఆదరణ ఉంది. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అన్న రేంజ్‌లో ప్రచారం కూడా సాగుతోంది.

అయితే గడ్కారీ మాత్రం ఉమాభారతిని ప్రోత్సహిస్తూ.. మిశ్రాను విస్మరిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. మరోవైపు... కాంగ్రెస్ చేసిన కోటా రాజకీయాలతో యూపిలో కులాల పునరేకీకరణ జరుగుతుందని B.J.P విశ్వసిస్తోంది. ఇదే గనక జరిగితే.. పశ్చిమ యూపిలోని దాదాపు 200 నియోజకవర్గాల్లో మైనార్టీల జనాభా కీలకంగా మారే అవకాశాలున్నాయి.

ఈ నియోజకవర్గాల్లో గుజరాత్ సిఎం నరేంద్రమోడీ ప్రచారం చేస్తే మిగతా వర్గాల ఓట్లు గంపగుత్తగా తమకే పడే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల నరేంద్ర మోడీ ఇప్పటివరకు ప్రచారం ఊసే ఎత్తడం లేదు. మొత్తం మీద ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూపీఏ వైఫల్యాలను క్యాష్‌ చేసుకోవాల్సిన కమలనాథులు అంతర్గత కలహాలతో చేజేతులా పరిస్థితిని పాడు చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Published Date : Saturday, 4/2/2012 11:38 AM IST
Related Articles
Gallery