అసెంబ్లీలో అసభ్యకర దృశ్యాలు చూసిన మంత్రి

* నీలి చిత్రాలు కాదంటున్న కర్నాటక మంత్రి
* రాజీనామాకు పట్టుబడుతున్న విపక్షాలు
ప్రజాసమస్యలకు పరిష్కారం చూపించాల్సిన ఓ మంత్రి.. అసలు విషయం పక్కకుపెట్టి కొసరు పనుల్లో బిజీ అయిపోయారు. అసెంబ్లీ సాక్షిగా "ఆ టైపు సీన్లు" చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన విపక్షాలపైనా అంతెత్తున లేచారు. "రామా అన్నా బూతు"గా అర్థం చేసుకుంటున్నారని వితండవాదం చేశారు. రాజీనామాకు ససేమిరా అంటూ మొండికేస్తున్నారు.
కర్నాటక విధానసభలో డర్టీపిక్చర్ కనిపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికైన అసెంబ్లీలో అశ్లీలానికి తావెక్కడిదని ఆశ్చర్యపోకండి. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రిగారి అత్యుత్సాహం కారణంగా అక్కడ బీజేపీ పరువు బజారున పడింది. ఓ పక్క అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతున్నా పట్టించుకోని మంత్రి.. సెల్‌ఫోన్‌లో అసభ్య దృశ్యాలు చూస్తూ కెమేరాకు చిక్కారు.
కర్నాటకలోని ఓ ప్రాంతంలో పాకిస్తాన్ జెండా ఎగరేయడంపై సభ అట్టుడికి పోతుంటే.. సహకార శాఖ మంత్రి లక్ష్మణ్ సవరి ఇలా అసభ్యకర దృశ్యాలు చూస్తూ కనిపించారు. పైగా పక్కకున్న వారికీ వాటిని చూపించారు. ఈ విషయం బయటకు రావడంతో.. విపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగాయి.
ఈ నిరసనలను లైట్ తీసుకున్న లక్ష్మణ్ సవారి.. తాను చూసింది బూతు బొమ్మలు కానే కాదంటున్నారు. మంగుళూరులో కొన్ని నెలల క్రితం ఓ యువతిపై అత్యాచారం జరిగిన విషయానికి సంబధించిన సాక్ష్యాల్ని ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి
చూపించానని.. బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని చెప్పానని బొంకుతున్నారు. రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు.
మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవడంలో ఇన్నాళ్లూ బీజేపీకి ఉన్న పరువు కాస్తా పోవడంతో రోడ్డున పడడం పట్ల బీజేపీ అగ్రనాయకత్వం ఆగ్రహంగా ఉంది. ఈ వ్యవాహారంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం సదానందగౌడను అధిష్టానం ఆదేశించింది.
Published Date : Wednesday, 8/2/2012 10:23 AM IST

Click Here to View/Post Comments (4)
| Julissa :
Gump :
imfyvhdcif :
skYi2d onzlyxcwhhhu
Agbavobor :
It\'s rlealy great that people are sharing this information.
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |