Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
పిఎంఓని చక్కదిద్దే పనిలో మన్మోహన్

AA

* 2జి స్కాం నేపథ్యంలో దిద్దుబాటు
* నాటి సలహాదారులపై ప్రధాని ఆరా
* వారే తప్పుదోవ పట్టించి వుంటారని అనుమానం
* బాధ్యుల్ని గుర్తించే పనిలో పిఎంఓ
* దోషులని తేలితే కఠిన చర్యలు


2జి స్కాంలో P.M.O నిర్లక్ష్య వైఖరిపై ఇటీవల సుప్రీంకోర్టులో నింద మోయడాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనపై పడ్డ మచ్చ చెరిపేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో తప్పుడు సలహాలిచ్చిన వారిని గుర్తించి.. వారిపై చర్యలు తీసుకునే పని మొదలుపెట్టారు. 2జి స్కాంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు పడటంతో P.M.O మేల్కొంది. ఈ కేసులో P.M.Oకి జవాబివ్వటానికి సుప్రీంకోర్టు నాలుగు నెలల వ్యవధి గడువు విధించింది.

మరో వైపు కేంద్రం తరపున సుప్రీంలో రివ్యూ పిటిషన్ ఏ విధంగా దాఖలు చేసే విషయమై సలహా ఇవ్వాలని అటార్నీ జనరల్ నానావతిని, ప్రధాని కోరారు. P.M.Oకి వచ్చే ప్రతి ఫైల్ స్వయంగా పర్యవేక్షించటం సాధ్యం కాదని ప్రధాని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. 2జి స్కాం జరిగిన సమయంలో P.M.Oకి సన్నిహితంగా పనిచేసిన అధికార్లు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. స్కామ్‌కు బాధ్యులని తేలితే వారిపై చర్యలకు మన్మోహన్ సింగ్ ఉపక్రమించనున్నారు.

అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రమేయంపై ట్రయల్ కోర్టులో రిలీఫ్ లభించినా.. ఈ కేసుకు సంబంధించినంతవరకూ మిస్టర్ క్లీన్ ఇమేజ్ కోసం దిద్దుబాటు మొదలుపెట్టారు. 2జి స్కాంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసే విధంగా పటిష్ట చర్యలు తీసుకునేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే P.M.Oను సంస్కరించే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు.

Published Date : Thursday, 9/2/2012 11:35 AM IST
Related Articles
Gallery