Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఎన్నికల తర్వాతా పొత్తులుండవు

AA

* UPలో ఒంటరి పోరే అన్న సోనియా

యూపి ఎన్నికల తదనంతరం ఏ పార్టీతో పొత్తుకు అవకాశం లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తేల్చి చెప్పారు. ఉన్నవ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె తమ పార్టీ ఎవరితో సయోధ్య కుదుర్చుకోబోదని తెగేసి చెప్పారు. యూపిలో ఎన్నికల తర్వాత కూడా తమ పయనం ఒంటరిగానే వుంటుందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సంకేతాలిచ్చారు. పార్టీ బావున్న రోజుల్లోనూ, కష్ట కాలంలోనూ ప్రజలతోనే తమకు నేరుగా సంబంధాలు ఉన్నాయని.. మిగతా పార్టీలపై ఆధార పడలేదని ఆమె చెప్పుకొచ్చారు.

గడిచిన 20 ఏళ్లుగా పరిపాలించిన పార్టీలు యూపి ప్రజలను దగా చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలోని S.P, B.S.P , B.J.P మూడు ఏదో ఒక సమయంలో అధికారం కోసం ఒకే పంచన చేరిన సంగతిని మరవరాదని సోనియా గుర్తు చేశారు. పొత్తులకు అవకాశం లేదని సోనియా, రాహుల్ ధీమాగా చెప్పటం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందుతున్నారు. ఓ వైపు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి.

403 సభ్యులున్న యూపి అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 202 రావాలంటే S.P, B.S.P రెండింటిలో ఏదో ఒక పార్టీతో కాంగ్రెస్ జత కట్టక తప్పని పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత హంగ్ అసెంబ్లీ వస్తే అతి పెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించవచ్చు. ఐతే కేంద్రంలో S.P మద్దతుతో మనుగడ సాగిస్తోన్న మన్మోహన్ సింగ్ సర్కార్ అనివార్య పరిస్ధితుల్లో ములాయంతో పొత్తు కు తెరదీస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Published Date : Thursday, 9/2/2012 11:40 AM IST
Related Articles
Gallery