నేడు సోనియా ఏకగ్రీవ ఎన్నిక...!
మేడం సోనియా గాంధీ మరోసారి ఏఐసీసీ అధ్యక్ష పీఠం అధిష్టించేందుకు రంగం సిద్దమైంది. వరుసగా నాలుగోసారి ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమైంది. ఆ పదవి కోసం ఆమె మినహా ఇంకెవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఇవాళ సోనియా ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. ప్రధాని మన్మోహన్ తో సహా పలువురు కేంద్ర మంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులతో కూడిన బృందాలు ఆమె పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. 1998 ఏప్రిల్ లో పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా...సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధినేతగా పనిచేసిన నేతగా ఇప్పటికే రికార్డు సృష్టించారు.
Published Date : Sep 03, Friday 11:40AM IST
Watch Video......
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


