తొలివసంతం పూర్తిచేసుకున్న UPA
మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని UPA సర్కారు తొలి వసంతం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. మూడు వివాదాలు, ఆరు విజయాలుగా సాగిన తొలి ఏడాది.. పూర్తి సంతృప్తినిచ్చిందని ఆయన అంటున్నారు. ప్రధాని ఏడాది పాలనపై ఫోకస్..వరుసగా రెండోమారు మన్మోహన్ సింగ్ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయింది. కామ్రేడ్ల ఊతం అవసరం లేకపోయినా.. బీఎస్‌పీ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ లాంటి అవకాశ పార్టీల చేదోడుతో.. చైర్‌పర్సన్ సోనియాగాంధీ.. UPAను విజయవంతంగా నెట్టుకొస్తున్నారు. మహిళా రిజర్వేషన్లను రాజ్యసభలో ఆమోదించుకోవడం, విద్యను ప్రాధమిక హక్కుగా మలచడం, ఆహారభద్రత బిల్లులో కదలిక తేవడం, గ్రామీణ ఉపాధి హామీ పథకం విస్తరణ, యూనిక్ ఐడీ ప్రాజెక్టు పురోగతి, ఆశాజనకంగా కనిపిస్తున్న ఆర్థికవృద్ధి లాంటి విజయాలు మన్మోహన్ టీమ్‌కు మంచి మార్కులు తెచ్చిపెట్టాయి.తరచూ భయపెడుతున్న మావోయిస్టుదాడులు, శశిథరూర్‌లాంటి ఓవరాక్షన్ మంత్రులు, దిగిరాని నిత్యావసరాల ధరలు లాంటి ఒడిదుడుకులు మినహాయిస్తే.. UPA సర్కారుది నల్లేరుపై బండి నడకే. గోడమీది పిల్లివాటం వహిస్తున్న ములాయం, మాయావతిల్లో ఎవరో ఒకరు తోడుగా వుంటే తప్ప మనలేని పరిస్థితి యూపీఏది. బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ల్లాంటివి అలవాటుగా మార్చుకున్న డీఎంకె, తృణమూల్‌కాంగ్రెస్‌లతో ఎలాగోలా ముందుకుసాగాల్సిన మన్మోహన్‌సింగ్.. గుంభనంగానే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. తొలి ఐదేళ్ల హయాంను విజయవంతంగా ముగించుకుని సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్న మన్మోహన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మిగతా నాలుగేళ్లు కూడా నెట్టుకొస్తారన్న భరోసా ఇవ్వగలిగారు.
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


