Live News Now
  • హైదరాబాద్: డిప్యూటి సిఈ శ్రీనివాస్ సస్పెన్షన్..
  • వెబ్ సైట్ లో ఇంజనీరింగ్ పనుల సమాచారాన్ని సరిచూసుకోకుండా పెట్టినందుకు...
  • శ్రీనివాస్ ను సస్పెండ్ చేసిన జిహెచ్ ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి...
  • ఈ అంశంపై విచారణకు కమిటి ఏర్పాటు..
  • ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ఈనెల 28న విడుదలవుతుందని ముఖేష్ భట్ వెల్లడి..
  • ప్రకాశం: కంభంలో చీటీల పేరుతో రు.కోటి వసూలు చేసి పరారైన ఇద్దరు వ్యక్తులు..
  • చెన్నై: జయలలితను పరామర్శించిన గవర్నర్ విద్యాసాగర్ రావు..కేంద్ర మంత్రి సుజనాచౌదరి..
  • చెన్నై: కోలుకుంటున్న తమిళనాడు సిఎం జయలలిత...
  • జయలలితను 10 రోజుల్లో ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.. సుజనా
  • ఛత్తీస్ గఢ్: బీజాపూర్ జిల్లా మునగా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు..ఒ మావోయిస్టు మృతి
ScrollLogo పార్వతీపురంలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసి దూదిని బయటకు తీసిన వైద్యులు.. ScrollLogo జమ్ముకాశ్మీర్: బారాము్ల్లాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్.. ScrollLogo కొమరంభీం: సిర్పూర్ లో రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద మృతదేహం లభ్యం.. ScrollLogo కొద్దిరోజులు క్రితం అదృశ్యమైన విద్యార్ధి అరుణ్ మృతదేహంగా అనుమానం ScrollLogo ప.గో: తాడేపల్లిగూడెం(మ) ఆరుగొలనులో ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి ScrollLogo హైదరాబాద్ లో రోడ్ల దుస్థితిపై ఫీవర్ ఆస్పత్రి ఎదుట బిజెపి ధర్నా.. ScrollLogo ధర్నాలో పాల్గొన్న లక్ష్మణ్,కిషన్ రెడ్డి, పలువురు నాయకులు... ScrollLogo హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పెద్ది సుదర్శన్ రెడ్డి... ScrollLogo తు.గో: కాకినాడలో సిఎం పర్యటనో వాహనం నుంచి జారిపడ్డ సమాచారశాఖ ఉద్యోగి.. ScrollLogo కామరూన్ లో ఘోర రైలు ప్రమాదం.. 33 మంది మృతి

చిరంజీవి vs బాలకృష్ణ

Tollywood-Farmers-To-Touch-AP-Politics
Posted: 115 Days Ago
Views: 1281   

రైతు.. మట్టితో పెనవేసుకుపోయిన ఈ పదం సమస్త మానవాళికి ఆహారం అందించే శ్రమయోధుడి సర్వనామం. నింగి చినుకులను అందిపుచ్చుకుని నేలను సాగును చేస్తూ వ్యవసాయమే పరమావధిగా జీవించే కర్మజీవి రైతు. అలాంటి రైతు ఇప్పుడు కమర్షియల్ అయిపోతున్నాడు. తలపాగా చుట్టుకునే రైతుకు బదులుగా స్టార్డమ్ చుట్టుకున్న రైతులు హల్ చల్ చేయబోతున్నారు. మరి వాళ్లెవరూ అంటారా.. ఒకరు అధికార పక్షానికి చెందిన రైతు బాలకృష్ణ.. మరొకరు ప్రతిపక్షానికి చెందిన ఎంపీ చిరంజీవి. మరి ఈ వెండితెర వ్యవసాయంతో వీరు పండించాలనుకుంటోన్న పంటలేంటో చూద్దాం. 

రైతేరాజు.. రైతే దేశానికి వెన్నుముఖ అంటారు మన రాజకీయ నాయకులు. కానీ ఆ రైతు ఇప్పుడు తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోయాడు. పంటపొలాలన్నీ అభివృద్ధి పేరుతో, సెజ్ ల మాయతో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతోంటే.. తరతరాలుగా ఆ భూమినే నమ్ముకున్న రైతు నుంచి రైతు కూలీల వరకూ.. నేలను దున్ని దుక్కి చేసి.. ఎన్నో రకాల ఆహార పంటలు పండించిన చోటే ఆకలి తీర్చుకునేందుకు కూలీలుగానో, సెక్యూరిటీ గార్డులుగానో మారుతున్నారు. సెజ్ ల పేరుతో తాము కోల్పోతున్న భూమి కోసం కొందరు గ్రామస్తులతో కలిసి ఓ యువకుడు సాగించిన పోరాటమే.. తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కత్తి నేపథ్యం. 

నిజానికి రైతు సబ్జెక్ట్ ఎప్పుడూ వెండితెరపై కాసుల పంట పండించేదే. రైతులు, వారి సమస్యల నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి విజయాలనే నమోదు చేసుకున్నాయి. నాటి రోజులు మారాయి నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు హిట్లుగానే నిలిచాయి. అయితే చాలాసార్లు ఈ సమస్య రైతులు.. కొందరు విలన్లుగానే ఉంటూ వస్తోంది మన సినిమాల్లో. తొలిసారిగా వ్యాపారవేత్తల ధనదాహానికి వ్యవసాయదారులు ఎలా కుదేలవుతున్నారో చెప్పిన సినిమా కత్తి. అందుకే ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తూ తన 151వ సినిమాగా.. ఇదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఒక రకంగా ఈయన ఈ సినిమాతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనుకోవచ్చు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అనేక ప్రశ్నలను సంధించవచ్చు.. 

చిరంజీవి చేస్తోన్న కత్తి రీమేక్ కత్తిలాంటోడుతో మరోసారి తన అభిమానులను సంతోషపెట్టడంతో  పాటు తను కోల్పోయిన అభిమానులను కూడా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడనుకోవచ్చు. నిజానికి చిరంజీవి ఇప్పటి వరకూ సీరియస్ గా రైతు పాత్రలు కానీ, రైతుల కోసం పాటుపడే హీరో టైప్ పాత్రలు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. అయినా రీ ఎంట్రీ కోసం.. తన ఇమేజ్ కోసం ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ కాకుండా ఇలా రైతు సబ్జెక్ట్ నే ఎంచుకోవడం వెనక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనేది సత్యం. ఇది ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి.. ఈ సినిమాతో అటు కమర్షియల్ హిట్ కొట్టినట్టూ ఉంటుంది.. ఇటు రాజకీయంగా తనకూ లబ్ధి చేకూరుతుంది. అతేకాక మొన్నామధ్య ఓ టివి ఫంక్షన్ లో ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని రాజకీయ నాయకుడి తరహాలో హామీలిచ్చేశాడు. అటే ఓ రకంగా ఈ సినిమాతో ఆంధ్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రణాళికలేవో రచించుకునే ఉంటాడు అనుకుంటున్నారు. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials