Harbhajan Singh : రాజ్యసభకి హర్భజన్ సింగ్ నామినేట్..!

Harbhajan Singh :  రాజ్యసభకి హర్భజన్ సింగ్  నామినేట్..!
Harbhajan Singh : అంతా ఊహించినట్టే జరిగింది.. టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకి వెళ్లనున్నారు.

Harbhajan Singh : అంతా ఊహించినట్టే జరిగింది.. టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకి వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురిలో క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒకరు.. భజ్జీతో పాటుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్ లను రాజ్యసభకి నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని ఏడుగురు రాజ్యసభ సభ్యులలో 5 మంది పదవీకాలం ఏప్రిల్ 9తో ముగుస్తుంది. మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు ఉండనున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story