Anushka Sharma: మీడియాకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క శర్మ.. ఆ కారణంగానే..

Anushka Sharma: మీడియాకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క శర్మ.. ఆ కారణంగానే..
Anushka Sharma: సౌతాఫ్రికా టూర్‌కి కుటుంబంతో సహా వెళ్లాడు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ... కూతురు వామిక పుట్టినరోజు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో అక్కడే బర్త్ డే పార్టీ నిర్వహించబోతున్నాడు విరాట్

Anushka Sharma: సౌతాఫ్రికా టూర్‌కి కుటుంబంతో సహా వెళ్లాడు భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ... కూతురు వామిక పుట్టినరోజు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో అక్కడే బర్త్ డే పార్టీ నిర్వహించబోతున్నాడు విరాట్...వామిక కోహ్లీ ఫోటోలు బయటికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..

అయితే జోహన్‌బర్గ్‌లో టీమ్ బస్సులో నుంచి అనుష్క శర్మ దిగుతున్న సమయంలో వామిక కోహ్లీ ఫోటోలు బయటికి వచ్చాయి...ఈ విషయాన్ని ముందుగానే గమనించిన విరాట్ కోహ్లీ, 'బేబీ ఫోటోలు తీయకండి ప్లీజ్...' అంటూ ఫోటోగ్రాఫర్లను, మీడియాను కోరాడు...అయినా విరాట్ విన్నపాన్ని మన్నించకుండా కొందరు వామిక కోహ్లీ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచురించగా, చాలామంది కోహ్లీ రిక్వెస్ట్‌ను మన్నించి... బేబీ ఫోటోలను ప్రచురించలేదు...

పబ్లిసిటీ, సర్కులేషన్, మార్కెటింగ్ ఇలాంటి విషయాలను పక్కనబెట్టి... ఎంతో మెచ్యూరిటీగా విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ప్రైవసీకి విలువనిచ్చిన మీడియావారికి థ్యాంక్స్ చెప్పింది అనుష్క శర్మ... 'మా ప్రైవసీకి విలువనిచ్చి వామిక ఫోటోలు, వీడియోలను ప్రచురించనందుకు పప్పారాజీకి, ఫ్యాన్స్‌కి, భారత మీడియాకి హృదయపూర్వకంగా థ్యాంక్యూ సో మచ్...

సోషల్ మీడియాకి దూరంగా ఉండేందుకు తన ఫోటోలు బయటికి రాకూడదని మేం నిర్ణయం తీసుకున్నాం.. తను పెద్దగా అయిన తర్వాత ఆమె కదలికలను మేం నియంత్రించలేం. అప్పటిదాకా ఈ విషయంలో మీ సహకారం కోరుతున్నాం. వామిక ఫోటోలు పోస్ట్ చేయకుండా అడ్డుకుంటున్న ఫ్యాన్ క్లబ్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు..' అంటూ పోస్టు చేసింది అనుష్క శర్మ.





Tags

Read MoreRead Less
Next Story