రెండో వన్డేలో భారత్‌ విజయం

రెండో వన్డేలో భారత్‌ విజయం

వెస్టిండీస్ పై భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్‌ ధావన్‌ (2) పరుగులకే అవుట్ అవ్వగా.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (34 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరే చేశాడు. ఇక విరాట్ కోహ్లీ (120; 125బంతుల్లో 14×4, 1×6) వన్డే కెరీర్ లో 42వ సెంచరీ సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (71) రాణించాడు. రిషబ్ పంత్(20), కేదార్ జాదవ్(16), రవీంద్ర జడేజా(16*) పరుగులు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. అయితే భువనేశ్వర్‌ కుమార్‌(4/31) బంతితో చెలరేగాడు. వెస్టిండీస్‌ 42 ఓవర్లలో 210 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలరల్లో షమి(2/39), కుల్దీప్‌(2/59) వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టినట్టయింది. కాగావర్షం కారణంగా తొలి మ్యాచ్‌ రద్దయింది. ఇప్పటికే టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story