జింబాబ్వే క్రికెట్ జట్టును సస్పెండ్ చేసిన ఐసీసీ.. టోర్నీల్లో నో ఎంట్రీ

జింబాబ్వే క్రికెట్ జట్టును సస్పెండ్ చేసిన ఐసీసీ.. టోర్నీల్లో నో ఎంట్రీ

ఒకప్పుడు అత్యుత్తమ క్రికెట్ జట్లలో ఒక్కటిగా ఉన్న జింబాబ్వే కాలక్రమేణ ఉనికే ప్రశ్నార్ధకంగా మార్చుకుంది . మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. జింబాబ్వే ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటినుంచి ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీల్లో జింబాబ్వేకి చెందిన క్రికెట్ జట్లు ఏవీ టోర్నీల్లో పాల్గొనడానికి వీలులేదు. అలాగే జింబాబ్వే క్రికెట్‌కు అందిస్తున్న నిధుల సాయాన్ని కూడా ఐసీసీ పూర్తిగా నిలిపివేసింది. కీలక ఆటగాళ్ళతో మేటి జట్లను సైతం మట్టికరిపించిన జింబాబ్వే వరల్డ్ క్లాస్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆండీ పైక్రాఫ్ట్, ఆండీ ఫ్లవర్, ఎడ్డో బ్రాండెస్,క్రెయిగ్ ఎవాన్స్ లాంటి మేటి ఆటగాళ్ళు ఆ జట్టు నుంచి ప్రాతినిద్యం వహించారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఆ క్రికెట్ జట్టుపై కూడా పడడంతో క్రమంగా ప్రభను కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story