Thomas Cup : థామస్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌

Thomas Cup :  థామస్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌
Thomas Cup : థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. భారత షటర్లు తొలిసారి థామస్‌ కప్‌ సాధించిపెట్టారు.

Thomas Cup : థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. భారత షటర్లు తొలిసారి థామస్‌ కప్‌ సాధించిపెట్టారు. సింగిల్స్‌, డబుల్స్‌ లో అద్భుతంగా రాణించిన భారత్‌ ఫైనల్లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఇండోనేషియాపై 3-0తో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. 73 ఏళ్ల థామస్‌ కప్‌ చరిత్రలో తొలిసారి కప్‌ అందుకుంది.

రెండో సింగిల్స్‌ లో కిదాంబి శ్రీకాంత్‌ వరుస గేమ్‌ల్లో జోనాథన్‌ క్రిస్టీపై గెలుపొందాడు. తొలి గేమ్‌ను అలవోకగా 21-15తో నెగ్గిన శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో జోనాథన్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. పోటాపోటీగా పాయింట్లు సాధించినా చివర్లో శ్రీకాంత్‌ పైచేయి సాధించి 23-21తో నెగ్గి భారత్‌కు అపూర్వ విజయం సాధించిపెట్టాడు.

అంతకుముందు తొలి సింగిల్స్‌ లో లక్ష్యసేన్‌ మూడు గేమ్‌ల పోరులో 8-21, 21-17, 21-16తో అంథోనీ గింటింగ్‌పై నెగ్గి భారత్‌ కు 1-0 శుభారంభం ఇచ్చాడు. లక్ష్యసేన్‌ స్ఫూర్తితో డబుల్స్‌ లో చిరాగ్‌ శెట్టి, సాథ్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి జోడీ 18-21, 21-17, 21-16తో మహ్మద్‌ ఎహసాన్‌, కెవిన్‌ సంజయ జోడీపై గెలుపొంది భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచారు.

భారత షట్లర్ల అద్భుత విజయంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్‌ గర్వించే విజయాన్ని సాధించిపెట్టారని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story