Usain Bolt: ట్రాక్ నుండి పిచ్‌పైకి ఉసేన్ బోల్ట్.. ఐపీఎల్ 2022లో..

Usain Bolt (tv5news.in)

Usain Bolt (tv5news.in)

Usain Bolt: జీవితంలో ఏదో సాధించాలని.. ఇంకేదో అయినవారు చాలామందే ఉంటారు.

Usain Bolt: జీవితంలో ఏదో సాధించాలని.. ఇంకేదో అయినవారు చాలామందే ఉంటారు. కానీ అందులో చాలా తక్కువమంది మాత్రమే వేరే ఫీల్డ్‌లో ప్రావిణ్యాన్ని సంపాదించినా కూడా మళ్లీ తమ కలను నెరవేర్చుకునే దిశలో ప్రయణిస్తుంటారు. అలా చేసి రెండు పడవలపై ప్రయాణం చేస్తూ సక్సెస్ సాధించిన వారు కూడా ఎందరో ఉన్నారు. అదే ప్రయోగాన్ని తాను కూడా చేయాలనుకుంటున్నాడట ఫాస్టెస్ట్ రన్నర్ ఉసేన్ బోల్ట్.

కొన్ని క్రీడలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఆటగాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అప్పుడప్పుడు ఆటగాళ్ల వల్లే ఆటకు పేరొస్తుంది. ఉసేన్ బోల్ట్ కూడా అలాంటి ఓ ఆటగాడే. రన్నింగ్‌ను ప్రత్యేకంగా చూస్తూ.. అభిమానించే వారు చాలా తక్కువమందే ఉంటారు. కానీ రన్నింగ్ గురించి అసలు ఏమీ తెలియని వారికి కూడా ఉసేన్ బోల్ట్ అంటే తెలిసుంటుంది. ఉసేన్ క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది మరి.

రన్ని్ంగ్ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్‌కు ఫేవరెట్ ఆట క్రికెట్ అట. ముందుగా తన కెరీర్‌ను క్రికెట్‌లోనే ప్లాన్ చేసుకున్నాడట ఉసేన్. కానీ అనుకోకుండా తనకు రన్నింగ్‌లో గుర్తింపు రావడం తన కెరీర్ ప్లాన్స్‌నే మార్చేసింది. తాజాగా తాను మరోసారి క్రికెట్ కెరీర్ గురించి ఆలోచనలు చేస్తున్నట్టు ఉసేన్ బోల్ట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రానున్న ఐపీఎల్‌లో తన పేరు కూడా ఉండాలని కోరుకుంటున్నాడట ఉసేన్.

ఐపీఎల్ 2022కు తాను సిద్ధమవుతానని అన్నారు ఉసేన్ బోల్ట్. తాను స్పోర్ట్స్‌లోకి వచ్చే సమయానికి తన దేశం జమైకాలో ఫుట్‌బాల్, క్రికెట్ మాత్రమే లీడ్ గేమ్స్‌గా ఉండేవని అన్నాడు. తన తండ్రికి క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. అందుకే తనకు కూడా క్రికెట్ మీద ఇష్టం ఏర్పడిందని తెలిపారు. తాను క్రికెట్ చూస్తూనే పెరిగానంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. తనకు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ అంటే ఇష్టమని, తన ఫేవరెట్ ప్లేయర్ వాకర్ అని అన్నారు.

చిన్నప్పుడు పాకిస్థాన్ టీమ్‌కు సపోర్ట్ చేసినా కూడా పెద్దయిన తర్వాత తన హోమ్ టీమ్‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారట ఉసేన్ బోల్ట్. ఉసేన్ కొంతకాలం ఫుట్‌బాయ్‌లో కూడా రాణించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆయన ఆట సామర్థ్యం ఏంటో చూపించాల్సిన సమయం వచ్చేసిందని చాలామంది అనుకుంటున్నారు. ఒకపక్క ఐపీఎల్ 2022కు ప్లేయర్స్ ఎవరో టీమ్స్ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈసారి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ కూడా ఐపీఎల్ పోటీల్లో అడుగుపెట్టనున్నాయి. ఉసేన్ బోల్ట్ చెప్పినట్టుగా వచ్చే ఐపీఎల్‌లో తాను ఉంటాడో లేదో తెలుసుకోవాలంటే మరికాస్త సమయం పడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story