భారత ఫుట్‌బాల్‌కు మంచిరోజులు
* భవిష్యత్తులో ఇండియా నుంచి సాకర్ హీరోలు !
* వరల్డ్‌కప్‌లోనూ ఆడే ఛాన్స్ !
* సాకర్ అభివృద్ధికి రంగంసిద్దం
* వరల్డ్‌క్లాస్ అకాడమీల ఏర్పాటుకు ప్రయత్నాలు
* వచ్చేయేడాది మార్చికల్లా నాలుగు రీజినల్ అకాడమీలు
* మరొక ఎలీట్ అకాడమీ
* కోచింగ్, ఎడ్యుకేషన్ ఫ్రీ
* టాలెంట్ హంట్‌తో 13, 14 యేళ్ల చిన్నారుల ఎంపిక
* రెండేళ్ల పాటు ఖర్చులన్నీ అకాడమీవే
* బెస్ట్ ప్లేయర్స్ ఎలీట్ అకాడమీకి ప్రమోట్
* ఎలీట్ అకాడమీలో రెండేళ్ల ట్రైనింగ్
* బెంగళూర్, కోల్‌కత, ఢిల్లీ, ముంబైలలో రీజనల్ అకాడమీలు
* 2013లో చెన్నై, చండీఘడ్, కేరళలో రీజినల్ అకాడమీలు
భారత ఫుట్‌బాల్‌కు మంచిరోజులు రానున్నాయా ? ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ సాకర్ స్టార్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా ? సాకర్ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లలో భారత జట్టు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉందా ? ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఇలాంటి ఆశలు పెట్టుకోరు. కాని భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి ఫిఫా, AIFF నడుం బిగించాయి. ఏమో అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో భారత్ సాకర్‌లో మేటి శక్తిగా ఎదిగినా ఎదగవచ్చు. మొన్న అర్జెంటీనా సాకర్ ఆటగాడు లయొనాల్ మెస్సీ కోల్‌కత వచ్చినప్పుడు భారతదేశం పులకించింది.
అర్జెంటీనా జట్టు ఇండియాలో ఉన్నంత కాలం... సాకర్ ఫ్యాన్స్ మెస్సీకి అడుగడుగునా నీరాజనాలు పలికారు. అదే సమయంలో మనదేశంలో ఎందుకు ఇటువంటి స్టార్ వెలుగులోకి రాలేకపోయాడన్న బాధ కలిగింది. రోజురోజు పతనమవుతోన్న భారత ఫుట్‌బాల్ నుంచి మెస్సీలాంటి ప్లేయర్ రావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పట్లో కాకున్నా... భవిష్యత్తులో ఇండియా నుంచి మెస్సీ లాంటి సాకర్ స్టార్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇందుకు కారణం... భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి బీజం పడింది. వందకోట్లపైగా జనాబా కలిగిన భారతదేశంలో ప్రతిభకు కొదువలేదు. పేదరికం వల్లనైతేనేమి... సరైన సదుపాయాలు లేని కారణంగా అయితేనేమి... సాకర్‌స్టార్లుగా ఎదుగలేకపోతున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వారికి అత్యుత్తమ శిక్షణ అందించి... ఇండియాలో ఫుట్‌బాల్‌ను డెవలప్ చేయడానికి సాకర్ అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఫిఫా సహకారంతో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ వరల్డ్‌క్లాస్ అకాడమీలు నెలకొల్పడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
వచ్చే యేడాది మార్చి వరకల్లా దేశంలో నాలుగు రీజినల్ అకాడమీలు, ఒక ఎలీట్ అకాడమీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ అకాడమీల్లో విద్యార్థులకు ఫుట్‌బాల్‌లో శిక్షణతో పాటు... అకాడమిక్ స్టడీస్‌ను కొనసాగిస్తారు. దేశ వ్యాప్తంగా అన్వేషించి... అత్యత్తమ ప్రతిభకల 13 లేదా 14 యేళ్ల వయస్సున్న చిన్నారులను రీజనల్ అకాడమీల్లో జాయిన్ చేస్తారు. వీరికి రెండేళ్ల పాటు ఉచిత వసతి అందించి వారి చదువుకు అయ్యే అన్ని ఖర్చులను అకాడమీనే భరిస్తుంది.
ఈ రీజినల్ అకాడమీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారిని ఎంపిక చేసి... ఎలీట్ అకాడమీకి ప్రమోట్ చేస్తారు. ఈ ఎలీట్ అకాడమీలో రెండేళ్లు... అంటే 16 నుంచి 18 యేళ్ల వయస్సు వచ్చే వరకు శిక్షణనిస్తారు. బెంగళూర్, కోల్‌కత, ఢిల్లీ, ముంబైలలో రీజనల్ అకాడమీలు నెలకొల్పనున్నారు. ఇక ఎలీట్ అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. వీటితో పాటు 2013లో చెన్నై, చండీఘడ్, కేరళలో మరోమూడు రీజినల్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఫిఫా తెలిపింది.
పేదరికంతోను... సదుపాయాలలేమితోను మరుగున పడిపోతున్న సాకర్ ప్రతిభ... ఈ అకాడమీల్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారతదేశం మారడోనా, పీలే లాంటి సాకర్ స్టార్లని ప్రపంచానికి అందించడం అసాధ్యంగా కనిపించడం లేదు.
Published Date : Monday, 12/9/2011 8:20 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |