Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
క్వార్టర్స్‌లో నిష్క్రమించిన వోజ్నియాకి


AA

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల వరల్డ్‌ నెంబర్ వన్ కరోలినా వోజ్నియాకీ పోరు ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ క్లియస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో వోజ్నియాకికి చెక్ పెట్టింది. క్లియస్టర్స్ 6-3 , 7-6 స్కోర్‌తో కరోలినాపై నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్ళింది. మొదటి సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన డెన్మార్క్ బ్యూటీ తర్వాతి సెట్‌లో మాత్రం పోటీ ఇచ్చింది. టై బ్రేక్‌కు దారితీసిన సెట్‌లో క్లియస్టర్స్‌దే పై చేయిగా నిలిచింది.

ఈ పరాజయంతో వోజ్నియాకీ అగ్రస్థానం కోల్పోనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో బెలారస్ భామ , మూడో సీడ్ విక్టోరియా అజరెంకా , పోలండ్‌ క్రీడాకారిణి రడ్‌వాన్‌స్కాపై నెగ్గింది. అజరెంకా 6-7 , 6-0 , 6-2 తేడాతో గెలిచి సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది.

Published Date : Wednesday, 25/1/2012 12:51 PM IST
Related Articles
Gallery