Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న అజరెంకా


AA

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా కైవసం చేసుకుంది. ఫైనల్లో అజరెంకా 6-3 , 6-0 తేడాతో రష్యా అందాల భామ మరియా షరపోవాపై విజయం సాధించింది. తద్వారా కెరీర్‌లో తొలి గ్రాండ్‌శ్లామ్ గెలుచుకుంది. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన తొలి బెలారస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఫైనల్లో షరపోవానే ఫేవరెట్‌గా భావించినప్పటకీ ఆమె ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలి సెట్ గెలిచేందుకు 46 నిమిషాలు తీసుకున్న బెలారస్ బ్యూటీ... రెండో సెట్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ముగించింది. ఈ విజయంతో అజరెంకా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా అందుకుంది. టైటిల్‌తో పాటు ఆమెకు 11.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.


Published Date : Saturday, 28/1/2012 5:58 PM IST

Related Articles
Gallery