Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఓపిక పట్టండి... బీర్ తాగండి... ఇంటి నుంచే పనిచేయండి


AA

ఓపిక పట్టండి... బీర్ తాగండి... ఇంటి నుంచే పనిచేయండి... లండన్ వాసులకు ఒలింపిక్ ఆర్గనైజర్స్‌ ఇస్తోన్న సందేశమిది. వచ్చే జులైలో ఒలింపిక్స్ ప్రారంభం కానుండడంతో... ప్లేయర్లతో పాటు పెద్ద ఎత్తున సందర్శకులతో లండన్‌ కిటకిటలాడడం ఖాయమని నిర్వహకులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవాణా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చేపట్టే కార్యక్రమంలో వారు ఈ సందేశాన్ని ఇస్తున్నారు.

జులై 27 నుంచి ఆగస్ట్‌ 12 వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఆధారపడకుండా ఉండాలని లండన్ వాసులను వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే... ఇదే అదనుగా భావించిన రవాణా ఉద్యోగులు మాత్రం తమ సమస్యలు తీర్చాలంటూ పలు డిమాండ్‌లను తెరపైకి తీసుకొస్తున్నారు.

Published Date : Tuesday, 31/1/2012 5:08 PM IST
Related Articles
Gallery