Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
సానియా జత కట్టేందుకు ఖురేషి ఆసక్తి


AA

పాకిస్తాన్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ ఖురేషి... హైదరాబాదీ స్టార్ సానియా మీర్జాతో జోడికట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. షోయబ్ మాలిక్‌కు అభ్యంతరం లేకుంటే... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా పార్టనర్‌గా ఆడుతానంటున్నాడు. ఒకవేళ తమ పార్టనర్‌షిప్ వర్కవుట్ అయితే... ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఇరుదేశాలకు మరిన్ని విజయాలు దక్కుతాయని చెప్తున్నాడు.

భారత్, పాక్ మధ్య సంబంధాలు మెరుగవడానికి... పీస్ మ్యాచ్ ఆడాలని ఖురేషి భావిస్తున్నాడు. ఇందుకోసం మహేష్ భూపతితో కలిసి ఇరుదేశాల ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు తెలిపాడు. గత యేడాది వరకు మహేష్ భూపతితో కలిసి డబుల్స్ ఆడిన ఖురేషి... ఇప్పుడు మరో భారత ప్లేయర్ రోహన్ బోపన్నతో జోడికట్టాడు.

Published Date : Tuesday, 31/1/2012 5:11 PM IST
Related Articles
Gallery