Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
షార్ట్ ఫార్మాట్ లోను రాత మారని టీం ఇండియా


AA

ఫార్మట్ మారినా... టీమిండియా జాతకం మాత్రం మారలేదు. సీనియర్ల స్థానంలో యువ క్రికెటర్లు జట్టులోకి వచ్చినా... ఆటతీరులో మార్పు రాలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురవుతోన్న వరస పరాజయాలకు ట్వంటీ-ట్వంటీలో నైనా బ్రేక్ పడుతుందనుకున్న అభిమానులను నిరాశ పరుస్తూ... యంగ్ క్రికెటర్లు సైతం వైఫల్యాల బాటలోనే నడుస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ ఓడిపోతే... భారత క్రికెటర్లు షార్ట్ క్రికెట్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారని ఓ కారణంగా చెప్పుకున్నాం.

కనకవర్షం కురిపించే ఐపీఎల్‌కు ప్రాధన్యతనిచ్చిన ఇండియన్ క్రికెటర్లు... ట్రెడీషనల్ టెస్టు ఫార్మట్‌ను నెగ్లెక్ట్ చేస్తున్నారనుకున్నాం. సరేలే... ట్వంటీ-ట్వంటీల్లో అయినా చెలరేగుతారని ఆశలు పెట్టుకున్నాం. కాని ఫస్ట్ టి-ట్వంటీల్లోనే ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. జట్టులో యువరక్తం ఎక్కించినా... గెలవాలన్న ఉత్సాహం కనిపించలేదు. ఐపీఎల్‌లో ఆడి టి-ట్వంటీ క్రికెట్‌లో విశేష అనుభవం సంపాదించినప్పటికీ... మనోళ్లు స్థాయికి తగినవిధంగా ఆడలేదు. అన్ని రంగాల్లో వైఫల్యాలను కొనసాగించారు.

దీంతో ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తూ... ధోనిసేన టి-ట్వంటీ సిరీస్‌లోను పరాజయాలను కంటిన్యూ చేసింది. అటు ఆస్ట్రేలియా కొత్త ముఖాలతోనే బరిలో దిగి... పటిష్టమైన భారత్‌ను కంగుతినిపించింది. పేరున్న ఆటగాళ్లు పెద్దగా లేనప్పటికీ... అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. టెస్టు క్రికెటర్లు అందించిన విన్నింగ్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేస్తూ... టి-ట్వంటీల్లోను ఆసీస్ క్రికెటర్లు భారత్‌ను చిత్తుచేసారు.

పుంజుకోడానికి ఇంకా అవకాశాలు మిగిలి ఉండడం యంగిండియా అదృష్టంగా చెప్పుకోవాలి. ఇప్పటికైన టీమిండియా క్రికెటర్లు సామర్థ్యం మేరకు రాణించి... విజయం కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తోన్న భారత అభిమానుల నిరీక్షణకు తెరదించాలని కోరుకుందాం.

Published Date : Thursday, 2/2/2012 5:06 PM IST
Related Articles
Gallery