Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
తొలి T 20కి రికార్డు స్థాయిలో హాజరైన ప్రేక్షకులు


AA

సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టి-ట్వంటీకి రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన ANZ స్టేడియం దాదాపు 60వేల మంది ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయింది. గత 84యేళ్ల ఆసీస్ హిస్టరీలో ఓ క్రికెట్ మ్యాచ్‌కు ఈ స్థాయిలో ప్రేక్షకులు స్టేడియానికి రావడం ఇదే మొదటిసారి. దీంతో మరిన్ని అంతర్జాతీయ టి-ట్వంటీ మ్యాచ్‌లు ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది.

ఆస్ట్రేలియా దేశవాళీ టి-ట్వంటీ టోర్నీ బిగ్‌బాష్‌లీగ్‌కు సైతం అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అవసరమైతే ఇతర ఫార్మట్‌ల మ్యాచ్‌లను తగ్గించుకొని... టి-ట్వంటీ మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతామని క్రికెట్ ఆస్ట్రేలియా CEO సదర్లాండ్ తెలిపారు.

Published Date : Thursday, 2/2/2012 5:08 PM IST
Related Articles
Gallery