Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఐపీఎల్‌ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్ళు


AA

* రవీంద్ర జడేజాను సొంతం చేసుకున్న చెన్నై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్‌ వేలం ఊహించినట్టుగానే జరుగుతోంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరికి రహస్య బిడ్డింగ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌ కంటే ఎక్కువ మొత్తం బిడ్ వేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 10 కోట్లకు పైనే జడేజాను దక్కించుకుంది. అలాగే న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా గట్టి పోటీ నడిచింది. 4.5 కోట్లకు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మెక్‌కల్లమ్‌ను సొంతం చేసుకుంది. ఇక శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్థనేకు మంచి ధర పలికింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ 6.1 కోట్లకు జయవర్థనేను పాడుకుంది. ఇదిలా ఉంటే లంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌ను 1.6 కోట్లకు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వేలంలో దక్కించుకుంది. ఇక జేమ్స్ ఆండర్సన్ , తమీమ్ ఇక్బాల్ , అడ్రియన్ భరత్ వేలంలో అమ్ముడవలేదు.

మెక్‌కల్లమ్ - 4.5 కోట్లు - కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌
రవీంద్ర జడేజా - 10 కోట్లపైన... - చెన్నై సూపర్‌కింగ్స్
మురళీధరన్ - 1.6 కోట్లు - బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
జయవర్థనే - 6.10 కోట్లు - ఢిల్లీ డేర్‌డెవిల్స్‌


Published Date : Saturday, 4/2/2012 2:20 PM IST .
Related Articles
Gallery