Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఈజిప్ట్ బాధితులకు ఫిఫా సాయం


AA

ఈజిప్ట్ సాకర్ మ్యాచ్ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు సాయం అందించడానికి ఫిఫా ముందుకువచ్చింది. కోటి 25లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించింది. బాధితులకు మరింత సాయం అందించడానికి సాకర్ ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

గతవారం ఈజిప్ట్‌లో ఆల్‌ మస్రీ, ఆల్‌ మహ్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన హింసలో 74 మంది మృతిచెందారు. వెయ్యిమంది వరకు గాయపడ్డారు. ఈ దుర్ఘటన జరిగిన రోజును ఫుట్‌బాల్‌ చరిత్రలో చీకటి దినంగా ఫాఫా అధ్యక్షుడు సెఫ్‌బ్లాటర్ అభివర్ణించారు.

Published Date : Thursday, 9/2/2012 2:06 PM IST
Related Articles
Gallery